టీమిండియా మాజీ పేసర్, ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ ఇర్ఫాన్ పఠాన్.. తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తమ దంపతులకు రెండో కుమారుడు జన్మించిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. భారత్ తరఫున అత్యుత్తమ పేస్ ఆల్రౌండర్లలో ఒకడిగా చెప్పుకునే ఇర్ఫాన్ పఠాన్.. 2020లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ మాజీ పేసర్ 2016 ఫిబ్రవరి 4న మక్కా వేదికగా హైదరాబాద్‌కు చెందిన మోడల్ సాఫా బైగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అనే పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా ఈ దంపతులకు మరో మగబిడ్డ జన్మించాడు. అతనికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు ఇర్ఫాన్ వెల్లడించాడు.
క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత క్రికెట్ అనలిస్ట్‌గా ఇర్ఫాన్ బిజీగా కాలం గడుపుతున్నాడు. అలాగే ఇటీవల ప్రముఖ ఇండియన్ ఫుట్‌బాల్ క్లబ్ మొహమదీన్ స్పోర్టింగ్ ఎస్సీ.. తమ అంబాసిడర్‌గా ఇర్ఫాన్ పఠాన్ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.
Safa and me welcome our baby boy SULEIMAN KHAN. Both baby and mother are fine and healthy. #Blessings pic.twitter.com/yCVoqCAggW
— Irfan Pathan (@IrfanPathan) December 28, 2021