భారత క్రికెట్ జట్టులో స్టార్ కల్చర్ పోవాల్సిందేనని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. ఆసీస్ చేతిలో భారత్ సిరీస్ ఓటమి తర్వాత పఠాన్ మాట్లాడుతూ ‘జట్టు స్టార్ల సంస్కృతికి ఇప్పటికైనా స్వస్తి పలుకాల్సిందే. స్టార్ కల్చర్ పోయి టీమ్ కల్చర్ రావాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇప్పటికైనా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయానికి రావాలి. కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్‌కు అవకాశమిస్తే కచ్చితంగా 30 సగటుతో పరుగులు సాధించేవాడు. గత కొన్నేండ్లుగా కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. కొవిడ్ తర్వాత అతని ఆటతీరు మరింత దారుణంగా మారింది. 2020 నుంచి 39 మ్యాచ్‌లు ఆడితే 30.72 సగటుతో 2,028 పరుగులు చేశాడు. కోహ్లీ.. దేశవాళీ క్రికెట్ ఆడి పదేండ్లు దాటే ఉంటుంది. ఫామ్ అందిపుచ్చుకునేందుకు సచిన్ టెండ్కూలర్ లాంటి దిగ్గజం కూడా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాడు’ అని అన్నాడు.