Harry Tector: ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీ టెక్టార్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌లను అధిగమించాడు.
ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌లో 722 పాయింట్లతో అత్యధిక రేటింగ్ పాయింట్స్ కలిగిన ఐర్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. 72 రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకొని 9 స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలిచిన 23ఏళ్ల టెక్టార్ అంతర్జాతీయ ఉత్తమ ఆటగాళ్లు అయిన స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్‌లను సైతం అధిగమించాడు. ఇప్పటివరకు ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్ పాల్ స్టిర్లింగ్. అతడు 2021లో 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో 140 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఆ సిరీస్‌లో మొత్తం మూడు ఇన్నింగ్స్‌ల్లో 206 పరుగులు చేశాడు. వచ్చే జూన్ జూలైలో జింబాబ్వేలో ఐర్లాండ్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఆడనున్న నేపథ్యంలో టెక్టార్ తన ర్యాంకును మరింత మెరుగుపరచుకునే అవకాశం ఉంది.
మరోవైపు వన్డే ర్యాంకింగ్స్‌ల్లో టాప్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. టాప్ 5లో ముగ్గురు పాకిస్థాన్ బ్యాటర్లు నిలవడం గమనార్హం. టెక్టార్ తర్వాత విరాట్ కోహ్లీ 8వ స్థానంలో, రోహిత్ శర్మ 10వ ర్యాంకులకు పరిమితమయ్యారు.
Harry Tector has achieved the highest rating by an Ireland batter in the latest @MRFWorldwide ICC Men’s ODI Player Rankings for Batting 🌟
Details ➡️ https://t.co/9xdbhCIxdK pic.twitter.com/uifF9a0aau
— ICC (@ICC) May 17, 2023