బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా జట్టులోకి అగర్ స్థానంలో జంపా వచ్చేశాడు. ఐర్లాండ్ జట్టు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. గ్రూప్ వన్‌లో ప్రస్తుతం ఐర్లాండ్ మూడవ, ఆస్ట్రేలియా నాలుగవ స్థానంలో ఉన్నాయి. రెండు జట్లకు మూడేసి పాయింట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఓడిపోగా, ఒక్కొక్క మ్యాచ్‌లో నెగ్గాయి.