IPL 2021 | ఇవాళే ఫైనల్ మ్యాచ్.. ఇప్పటివరకు ఏ జట్టు ఎన్నిసార్లు టైటిల్ కొట్టింది
ఐపీఎల్ 2021 | 13 సీజన్లలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదు సీజన్లలో టైటిల్ గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సీజన్లలో టైటిల్ గెలిచి రెండోస్థానంలో ఉంది.
IPL 2021 | ఐపీఎల్ పోరు తుది అంకానికి చేరుకుంది. కరోనా నేపథ్యంలో మధ్యలో బ్రేక్ తీసుకుని.. ప్రారంభమైన 14వ సీజన్ రెండో దశ అప్పుడే ఫైనల్‌కు వచ్చేసింది. దుబాయి వేదికగా మరికాసేపట్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లలో ఐపీఎల్ -14 విజేత ఎవరో కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని సీజన్లు జరిగాయి.. వాటిలో ఏ జట్టు గెలిచింది? వంటి వివరాలు ఒకసారి చూద్దాం..

2008లో ప్రారంభమైన ఈ పొట్టి ఫార్మట్‌లో ఇప్పటివరకు 13 సీజన్లు జరిగాయి. వీటిలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదు సీజన్లలో టైటిల్ గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మూడు సీజన్లలో టైటిల్ గెలిచి రెండోస్థానంలో ఉంది.ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్, దక్కన్ చార్జర్స్(ఇప్పుడు టోర్నీలో లేదు), రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచి విజేతగా నిలిచాయి. ఇక 14వ సీజన్ ( IPL 2021 )లో చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే), కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన చెన్నై, కోల్‌కతా మరోమారు కప్‌ను ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి.

2008 ఐపీఎల్ సీజన్ 1
తొలి ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్‌కు వెళ్లాయి. ఇందులో చెన్నైను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ తొలి టైటిల్ గెలుచుకుంది.
2009 ఐపీఎల్ 2
ఇక రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్కన్ చార్జర్స్ ఫైనల్‌కు వెళ్లగా.. దక్కన్ చార్జర్స్ టైటిల్ దక్కించుకుంది.
2010 ఐపీఎల్ 3
తొలి సీజన్లో కొద్దిలో కప్ మిస్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఆడి గెలిచింది. ముంబయి ఇండియన్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది.
2011 ఐపీఎల్ 4
గత సీజన్లో కప్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది. 2011లో ఫైనల్‌కు చేరిన చెన్నై.. రాయల్ చాలెంజర్స్‌ను మట్టికరిపించింది.
2012 ఐపీఎల్ 5
వరుసగా మూడోసారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కొడదామని ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. చెన్నైను ఓడించి తొలిసారి కప్ గెలుచుకుంది.
2013 ఐపీఎల్ 6
హ్యాట్రిక్ మిస్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో ఆడి ఫైనల్‌కు చేరింది. కానీ ఈ సీజన్‌తో రెండోసారి కూడా చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. ఆరో సీజన్ తుది పోరులో చెన్నైని ఓడించి ముంబై ఇండియన్స్ తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది.
2014 ఐపీఎల్ 7
తొలిసారి కప్ గెలవాలని అనుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశలను కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడియాశలు చేసింది. ఏడో సీజన్ తుదిపోరులో పంజాబ్‌కు చుక్కలు చూపించి రెండోసారి కప్ చేజిక్కించుకుంది.
2015 ఐపీఎల్ 8
ఈ సీజన్లో ఎలాగైనా కప్ గెలవాలని కష్టపడి ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ముంబై ఇండియన్స్ రెండోసారి కూడా షాకిచ్చింది. చెన్నైని ఓడించి రెండోసారి టైటిల్ గెలుచుకుంది.
2016 ఐపీఎల్ 9
ఈ సీజన్‌తో తొలిసారి టైటిల్‌ను గెలవాలని ఆశపడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు సన్ రైజర్స్ షాకిచ్చింది. వార్నర్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరును ఓడించి తొలి టైటిల్‌ను ముద్దాడింది.
2017 ఐపీఎల్ 10
ఈ సీజన్‌తో ముంబై ఇండియన్స్ మూడోసారి టైటిల్ గెలిచింది. ఆ సీజన్ ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో హోరాహోరీ పోరులో విజేతగా నిలిచింది.
2018 ఐపీఎల్ 11
రెండోసారి టైటిల్ కొట్టాలన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి ముచ్చటగా మూడోసారి కప్ గెలుచుకుంది.
2019 ఐపీఎల్ 12
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ముంబై పైచేయి సాధించింది. ఈ సీజన్‌తో నాలుగోసారి ముంబై ఇండియన్స్ కప్ గెలుచుకుంది.
2020 ఐపీఎల్ 13
కరోనా కారణంగా దుబాయిలో జరిగిన ఈ సీజన్లో గెలిచి ముంబై ఇండియన్స్ ఐదోసారి కప్ గెలుచుకుంది. తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను అలవోకగా ఓడించి విజేతగా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
IPL 2021 | దసరా ధమాకా.. మరికాసేపట్లో ఐపీఎల్ ఫైనల్
IPL 2021 | ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిన దినేశ్ కార్తీక్
New Jersy for Team India | టీం ఇండియాకు న్యూ జెర్సీ.. స్పెషాలిటీ ఏమిటంటే?!
Rishabh Pant | అందరూ ధోనీలు కాలేరు.. పంత్‌కు కొంచెం టైం ఇవ్వండి: మాజీ పేసర్ సలహా
Rahul Dravid | టీమిండియా తాత్కాలిక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

