IPL మెగా టోర్నీలో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ టీం కీలక బ్యాటర్లు త్వరగా పెవిలియన్‌కు చేరడంతో స్కోర్ నెమ్మదించింది. గుజరాత్ బౌలర్ రాహుల్ తెవాతియా వేసిన ఏడో ఓవర్లో సిక్స్ కొట్టిన సంజూ శాంసన్.. ఆ తరువాత ఫెర్గూసన్ వేసిన ఓవర్లో హార్ధిక్ పాండ్య అద్భతమైన ఫీల్డింగ్ చేయడంతో శాంసన్ రనౌటయ్యాడు. రషీద్ ఖాన్, హార్ధిక్ పాండ్యా కాస్త పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ స్కోరు పది ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 89 పరుగులు. డస్సెన్ (6 నాటౌట్), హెట్మయర్(8 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్(54- 24 బంతుల్లో) చెలరేగి ఆడాడు. లాకీ ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్ ఆఖర్ బంతికి బౌల్డయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్(8) కూడా మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
మ్యాచ్ ఆరంభంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రెండు ఓవర్లు ముగిసేలోపే మాథ్యూ వేడ్ (7), విజయ్ శంకర్ (2) ఔటయ్యారు. శుభ్‌మన్ గిల్ (13) పరుగులు తీయడంలో విఫలమయ్యాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే కీలక వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ నిలకడగా ఆడుతూ పరుగుల వేటలో ముందుకెళ్లింది. హార్దిక్ పాండ్యా (87 ) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అభినవ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (31) కూడా ధాటిగా ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి గుజరాత్ 192 పరుగులు చేసింది.