వీలైనంత త్వరగా ఐపీఎల్‌ను పున:ప్రారంభిస్తామని ఈ లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘టోర్నీకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. కానీ ఇక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పలువురు విదేశీ క్రికెటర్లు ఇప్పటికే తమ సొంత దేశానికి వెళ్లిపోయారు.
వారిని ఒప్పించి తిరిగి లీగ్ విజయవంతంగా జరిగేలా చూడటం మా ముందున్న అతిపెద్ద సవాల్’ అని చెప్పారు. ఇదిలాఉండగా ఐపీఎల్ వారం రోజులు వాయిదాపడటంతో విదేశీ క్రికెటర్లతో పాటు పలువురు భారత క్రికెటర్లూ సైతం తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.