IPL Brand | ఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. పొట్టి క్రికెట్‌గా పేరొందిన టీ-20 లీగ్ టోర్నీ ఐపీఎల్ బ్రాండ్ విలువ తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు 19 రెట్లు పెరిగింది. మ్యాచ్వారీగా మార్కెట్ క్యాపిటలైజేషన్ గణించినా ఐపీఎల్ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. రెండు కొత్త జట్లు చేరడంతో 2023లో ఐపీఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.1.6 బిలియన్ డాలర్లు పెరిగింది. రెండు జట్లు కొత్తగా జత కలవడంతో ఐపీఎల్ టోర్నీలో నిర్వహించే మ్యాచ్‌ల సంఖ్య 74 నుంచి 94కి పెరిగింది.
ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ నడుస్తున్నది. 15 ఏండ్లుగా నిలకడగా సాగుతున్న టోర్నీలో క్రికెట్‌కు, మైదానాలకు మధ్య చాలా సుదీర్ఘ అనుబంధం పెరిగింది. మ్యాచ్‌ల వల్ల ప్రేక్షకులకు వినోదం లభిస్తుంటే, నిర్వాహకులకు ఆదాయం లభిస్తున్నది. ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం ద్వారా బీసీసీఐకి 6.2 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. ప్రతి మ్యాచ్ వారీగా గణిస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఐపీఎల్‌ను రెండో అతిపెద్ద లీగ్‌గా పరిగణిస్తున్నారు.
2008లో డీల్ పరిమాణం 20 రెట్లు ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు ఐపీఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.87 వేల కోట్లు (10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ). 2008లో ఒక యూనికార్న్ టోర్నీగా మొదలైన ఐపీఎల్.. ఇప్పుడు డెకాకార్న్‌గా అవతరించింది. అంటే దాని విలువ పది బిలియన్ డాలర్ల పై చిలుకే.
వీటిల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైసీ విలువ 83 మిలియన్ డాలర్లలో అత్యధిక బ్రాండ్ విలువ పలుకుతున్నది. తర్వాతీ దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ 77 మిలియన్ డాలర్లు, చెన్నై సూపర్ కింగ్స్ 74 మిలియన్ డాలర్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) 68 మిలియన్ డాలర్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 62 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకోగా, తర్వాతీ స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు, , రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ (డక్కన్ చార్జర్స్), గుజరాత్ టైటాన్స్ ఒక్కో సారి ట్రోఫీ గెలుచుకున్నాయి.