బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 కోసం బెంగుళూరులో క్రికెటర్ల వేలం పాట జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్లో అపశృతి చోటుచేసుకున్నది. వేలం నిర్వహిస్తున్న హగ్ ఎడ్మీడ్స్ అకస్మాత్తుగా స్టేజ్ మీద కింద కూలిపోయాడు. వేలం పాట నిర్వహిస్తూనే అతను సొమ్మసిల్లిపోయాడు. దీంతో కొంత సేపు వేలాన్ని ఆపరేశారు. శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగ కోసం బిడ్డింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేస్తోంది. వేలం పాటను మళ్లీ 3.30 నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. వేదికపై కూలిన ఆక్షనీర్ హగ్ ఎడ్మీడ్స్ను హాస్పిటల్కు తరలించినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.