IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రిటెన్షన్ (Retention) గడువుకు ముందే వేలం తేదీ, వేదికలు ఖరారయ్యాయి. ఊహించినట్టుగానే ఈసారి కూడా గల్ఫ్ దేశంలోనే ఆక్షన్‌కు ఐపీఎల్ పాలక మండలి ఆమోదం తెలిపింది. గత రెండు సీజన్లకు విదేశాల్లోనే వేలం పాట నిర్వహించారు. ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించింది ఐపీఎల్ కార్యవర్గం. ఫ్రాంచైజీ యజమానులు సైతం ఓకే అనడంతో అబుధాబీలో డిసెంబర్ 16వ తేదిన క్రికెటర్లపై నోట్ల వర్షం కురువనుంది.
పదిహేడో సీజన్ వేలం దుబాయ్‌లో, 18వ సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగాయి. 19వ సీజన్ మినీ వేలం అబుధాబీలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి. ఇదే వేదికను ఖరారు చేసిన విషయాన్నిముందుగానే ఫ్రాంచైజీ యజమానులకు నిర్వాహకులు చెప్పారు. అయితే.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ లేదా బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అనుకుంటుండా.. డేట్, వెన్యూ ఫిక్స్ అనే వార్త వచ్చేసింది. నవంబర్ 15 సాయంత్ర వరకూ రిటెన్షన్ జాబితాను ఫ్రాంచైజీలు ప్రకటించాల్సి ఉంది.
The 2026 IPL auction will take place on December 16 in Abu Dhabi. This will be the third successive year when the IPL auction is being held overseas. Like all mini auctions, the 2026 edition, too, will be a day-long exercise pic.twitter.com/EWWrYYDFsk
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2025
ఐపీఎల్ వేలం తేదీ రావడంతో రికార్డు ధర పలికేదుఎవరు? ఏ జట్టు ఎవరిని కొటుంది? ఎవరిని వదిలేస్తుంది? అనే చర్చలు జోరందుకోనున్నాయి. ప్రతిభావంతులపై కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు కసరత్తు షురూ చేయనున్నాయి. గత సీజన్లో రిషభ్ పంత్ (Rishabh Pant) రూ.27 కోట్లతో అత్యధిక ధర పలుకగా.. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్, అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ కొనగా.. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అట్టిపెట్టుకుంది. ఈసారి వెంకటేశ్‌ను కోల్‌కతా వదులుకోవడం ఖాయమని తెలుస్తోంది. అలానే.. పలువురు స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి వచ్చే అవకాశముంది.
More details here ⬇️ https://t.co/o07NZQGfhw
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2025