MS Dhoni | భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. మార్చిలో మొదలవనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 కోసం డెన్‌కు చేరుకున్నాడని ఫ్రాంచైజీ పేర్కొంది. అయితే, ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అనే చర్చ సాగుతున్నది. ఈ విషయంలో మాజీ కెప్టెన్ సైతం క్లారిటీ ఇచ్చాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. ధోనీ తాను వేసుకున్న టీ షర్ట్‌తోనే.. తనకు ఇదే ఆఖరి ఐపీఎల్ అనే సందేశం ఇచ్చినట్లుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ కోసం చెన్నైకి ధోనీ చేరుకున్నాడు. పటిష్ట భద్రత మధ్య విమానాశ్రయంలో నుంచి వస్తుండగా.. అందరి దృష్టి ధోనీ వేసుకున్న టీ షర్ట్‌పై ఉంది. ఆ టీ షర్ట్‌పై ఉన్న డిజైన్‌లో మోర్స్ కోడ్ ఉందని.. దానికి ‘చివరిసారి’ అని అర్థం చెబుతూ.. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ సోషల్ మీడియాలో హాట్ చర్చ సాగుతున్నది.
The Shirt Dhoni wore while arriving in Chennai had a morse code that read
“One last time” #MSDhoni #IPL2025 pic.twitter.com/9jHQKFHsVv— Tejas (@TejasVenugopal) February 26, 2025
ఇదిలా ఉండగా.. ఇటీవల జియో హాట్‌స్టార్‌లో నటుడు సన్నీ డియోల్‌తో కలిసి చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మ్యాచ్‌ను చూశాడు. అంతకు ముందు సంజు సామ్సన్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఫిట్‌గా ఉండేందుకు.. రెండునెలల ఐపీఎల్‌కు కోసం సిద్ధంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని ధోనీ పేర్కొన్నాడు. తాను సంవత్సరానికి కొన్ని నెలలు మాత్రమే ఆడుతానని.. కానీ, తొలిసారి ఎలాగైతో ఆడానో.. అదే తరహాలోనే ఆస్వాదించాలనుకుంటున్నానని చెప్పాడు. గత ఆరు నుంచి ఎనిమిది నెలలు కష్టపడాల్సి ఉంటుందని.. ఎందుకంటే ఐపీఎల్ అత్యంత క్లిష్టమైన టోర్నీల్లో ఒకటని పేర్కొన్నాడు. మీ వయసు ఎంత అని ఎవరూ పట్టించుకోరని.. మీ వయసు ఎంత అయినా.. లీగ్‌లో స్థాయి తగ్గకూడదని.. అందుకే తన శారీరక, మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు తాను నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.
MS Dhoni arrived at Chennai Airport wearing a T-shirt that says “One Last Time” in morse code!
Bitter sweet! 🥹#MSD #CSK #IPL2025 pic.twitter.com/UySnNUvDOn
— Homskyra (@homskyra) February 26, 2025
దేశం తరఫున ఆడడం తన కెరీర్లో ప్రేరణ అని పేర్కొన్నాడు. తాను పెద్దగా క్రికెట్‌కు గుర్తింపు లేని రాష్ట్రం నుంచి వచ్చానని.. తనకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు.. దేశానికి ప్రాతినిథ్యం వహించినప్పుడు తనకు గొప్ప గౌరవంగా అనిపించిందని ధోనీ పేర్కొన్నాడు. తనకు అవకాశం వచ్చిన తర్వాత మ్యాచ్‌లో గెలవడానికి ప్రయత్నిస్తున్న గెలిచే జట్టులో భాగం కావాలని కోరుకున్నానని.. అది పెద్ద టోర్నీ అయినా.. ద్వైపాక్షిక సిరీస్ అయినా.. మేము ఓ జట్టుగా గెవడానికి ప్రయత్నించామని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యానని.. కానీ క్రికెట్ఫై ప్రేమ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని ధోనీ వివరించాడు.