IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఉత్కంఠగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 46 మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్ పోరాటం రసవత్తరంగా మారింది. నాలుగు ప్లేఆఫ్ బెర్తుల కోసం ఎనిమిది జట్ల మధ్య పోరాటం జరుగుతున్నది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఈ రేరసు నుంచి వైదొలిగాయి. అయితే, ఈ మొత్తం సీజన్లో చాలా జట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. పలు జట్లు ప్రారంభంలో శుభారంభం చేసినా.. రెండోరౌండ్ వరకు కొనసాగించలేకపోయాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏ జట్టు ఎలా ప్రదర్శన ఏంటీ..? ప్లేఆఫ్ సమీకరణాలు ఏంటో తెలుసుకుందాం రండి..!
ఐపీఎల్లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉన్నది. ఆడిన పది మ్యాచుల్లో ఏడు విజయాలు ఉండగా.. 14 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నది. ఇక గుజరాత్ 12 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నది. ముంబయి, ఢిల్లీ జట్లు సైతం 12 పాయింట్లతో ఉన్నప్పటికీ.. రన్‌రేట్ కంటే గుజరాత్ వెనుకబడి ఉన్నది. ఇక ముంబయి ఇండియన్స్ మూడు, ఢిల్లీ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ పది పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నది. మూడుసార్లు చాంపియన్స్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు పాయింట్లతో ఏడోస్థానంలో ఉన్నది. 2016లో చాంపియన్స్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు పాయింట్లతో ఎనిమిదోస్థానంలో, రాజస్థాన్, చెన్నైలు చెరో నాలుగు పాయింట్లతో తొమ్మిది, పదో స్థానంలో ఉన్నాయి.
ఈ సీజన్ ప్రారంభంలో ఢిల్లీ, పంజాబ్ జట్లు శుభారంభం చేశాయి. ఢిల్లీ తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచింది. ఒక ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే, ఆరో మ్యాచ్ తర్వాత జట్టు మాత్రం వెనకపడుతూ వచ్చింది. అనంతరం ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచ్‌ను గెలిచింది. మరో వైపు పంజాబ్ సైతం తొలి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచింది. ఆ తర్వాత రెండు మ్యాచులు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆయా జట్లు పాయింట్ల పట్టికలో దిగజారుతూ వచ్చాయి. ఆర్సీబీ చేతిలో ఓటమి పాలవడం.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. ప్లేఆఫ్ కోసం జరుగుతున్న పోరు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో రెండు జట్లు తమ శక్తి మేరకు కృషి కృషి చేయాల్సిందే. 16 పాయింట్లు అర్హత మార్క్‌గా పరిగణిస్తే.. ఢిల్లీ మిగిలిన ఐదు మ్యాచుల్లో కనీసం రెండు గెలవాలి. పంజాబ్ మిగతా ఐదు మ్యాచుల్లో కనీసం మూడింట్లో విజయం సాధించాల్సిందే.
కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ ప్లేఆఫ్ బెర్తులు కష్టంగానే ఉన్నాయి. ఆయా జట్ల సమీకరణాలు విజయాలతో పాటు ఇతర జట్ల ఫలితాలపై సైతం ఆధారపడాల్సి రానున్నది. కేకేఆర్ ఫ్లేఆఫ్‌కు చేరాలంటే ఐదు మ్యాచుల్లో గెలవాల్సిందే. అప్పుడు 17 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో చేరుతాయి. ఇక సన్‌రైజర్స్ ఐదు మ్యాచుల్లో గెలవాలి. హైదరాబాద్ పాయింట్లు 16కి పెరుగుతాయి. ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం ఈ సీజన్‌ను బాగానే ప్రారంభించింది. కానీ, టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ జట్టు వెనుకపడుతూ వచ్చింది. జట్టులోని ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్స్ సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో జట్టు కుప్పకూలింది. ప్రస్తుతం లక్నో ప్లేఆఫ్ చేరుకోవాలంటే.. మిగతా నాలుగు మ్యాచుల్లో కనీసం మూడు గెలవాలి. ఒక్క ఓటమి కూడా ఆ జట్టును ప్రమాదంలో పడే ప్రమాదం ఉంటుంది.
ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గింది. ప్రారంభంలో జట్టు ఓటమిపాలవుతూ వచ్చింది. తొలి ఐదు మ్యాచుల తర్వాత.. ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. తొలి ఐదు మ్యాచుల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి.. నాలుగు ఓడిపోయింది. రెండు పాయింట్ల.. మైనస్ 0.01 రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానంలో ఉండేది. ఆ తర్వాత ఐదు మ్యాచులు జట్టు తలరాతను మార్చేశాయి. ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచి.. ప్రస్తుతం పది మ్యాచుల తర్వాత ఆరు విజయాలు.. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. 12 పాయింట్లు.. ప్లస్ 0.89 రన్‌రేట్ ఉన్నది. ముంబయి 2013, 2015, 2017, 2020 సంవత్సరాల్లో ఐదు మ్యాచుల్లో చాంపియన్స్‌గా నిలిచింది. 2010లో ముంబయి వరుసగా ఐదు మ్యాచులు గెలిచి ఫైనల్‌కు చేరింది. కానీ, ఫైనల్లో చెన్నై చేతిలో ఓడిపోయింది. 2008లో జట్టు ఆరు మ్యాచులు గెలిచినా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ప్రస్తుతం ముంబయిని చూస్తే ఆ జట్టుకు ఎదురే లేనట్లుగా కనిపిస్తుది. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచుల్లో కనీసం రెండు గెలిచినా ఫ్లేఆఫ్‌కు చేరుతుంది.
ఈ సారి రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సారి ఆర్సీబీ గతేడాదికి భిన్నంగా ఆడుతోంది. ప్రత్యర్థి జట్ల సొంత మైదానాల్లో ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. ఆర్సీబీ తొలిసారిగా ప్రత్యర్థి మైదానాల్లో గెలువడం విశేషం. 2015లో ఆర్సీబీ ఇదే తరహాలోనే ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. ఈ సీజన్లో జట్టు బెస్ట్ ప్రదర్శన ఇచ్చింది. ప్రత్యర్థి జట్లకు ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. ఆర్సీబీ పది మ్యాచుల్లో ఏడు గెలిచి.. మూడు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. 14 పాయింట్లు.. నెట్ రన్‌రేట్ +0.521గా ఉన్నది. సొంత మైదానాల్లో మూడు మ్యాచుల్లో ఓడిపోయారు. ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
కనీసం ఒక విజయం వారిని ప్లేఆఫ్స్‌కు వెళ్తున్నది. జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వరకు మూడింట్లో అద్భుతంగా రాణిస్తుంది. రెండోస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ సైతం అద్భుత ప్రదర్శన చేస్తున్నది. 2022 ఛాంపియన్ జట్టు శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలో మెరుగ్గానే రాణిస్తున్నది. జట్టు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. రెండింట్లో ఓడిపోయారు. గుజరాత్ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. ప్లస్ 1.104గా ఉన్నది. మిగతా ఆరు మ్యాచుల్లో కనీసం రెండు మ్యాచులైనా గెలువాల్సి ఉంటుంది.