Mitchell Marsh | ఐపీఎల్-2025 సీజన్లో ఆడేందుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అనుమతి లభించింది. అయితే, కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడనున్నాడు. ఈ సీజన్లో మిచెల్ మార్ష్ లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఆడుతాడా? లేదా? అన్నది అనుమానాస్పదంగా ఉండగా.. నిపుణులతో చర్చించిన తర్వాత లక్నో జట్టు తరఫున ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా ఓ నివేదిక పేర్కొంది. రీహాబిలిటేషన్, వైద్య పరీక్షల అనంతరం ఈ ఆల్‌రౌండర్‌కు షరతులతో కూడిన అనుమతి వచ్చింది. అతను బౌలింగ్ చేయొద్దని.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వీపుపై ఎక్కువగా ఒత్తిడిపడకుండా చూసుకోవాలని స్పెషలిస్ట్ అడ్వైజ్ ఇచ్చాడు.
ఈ క్రమంలో మిచెల్ మార్ష్ కేవలం లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడనున్నాడు. మార్ష్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఈ ఆల్‌రౌండర్ లేకపోవడంతో ఆ లోటు కనిపించింది. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెటర్లో మార్ష్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మార్ష్ బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇబ్బందుపడుతున్న నేపథ్యంలో భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో తుది జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో బ్యూ వెబ్‌స్టర్‌కు చోటు కల్పించారు. మిచెల్ మార్ష్ జనవరిలో జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. తాజాగా ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.