న్యూఢిల్లీ: ఐపీఎల్-2024 మెగావేలానికి వేదిక, తేదీలు ఖరారయ్యాయి. జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ఐపీఎలో వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 1165 భారత క్రికెటర్లు ఉన్నారని బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. విభాగాల వారీగా చూస్తే..320 మంది క్యాప్డ్డ్ ప్లేయర్లు, 1,224 అన్క్యాప్డ్డ్ ప్లేయర్లు, అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు భారత్ నుంచి 48 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు వేలంలోకి వస్తున్నారు. సోమవారం ఐపీఎల్ వేలంలో రిజిస్ట్రేషన్‌కు ఆఖరు కాగా, 409 మంది విదేశీ ప్లేయర్లు వేలంలో ఎంత ధర పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 25 మందితో జట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటికే ఎంపిక చేసుకున్న రిటైన్ ప్లేయర్లతో కలిపి. మొత్తంగా వేలంలో 204 స్థానాల కోసం ప్లేయర్లు పోటీపడనున్నారు. ఈసారి రాహుల్, అయ్యర్, పంత్ లాంటి స్టార్ క్రికెటర్లు వేలంలో తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే ఈ వేలం జరుగనుంది.