MS Dhoni | మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆరేళ్లవుతోంది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే పాల్గొంటూ వస్తున్నాడు. ప్రతీ సీజన్‌కు ముందు ధోనీ రిటైర్మెంట్పై భారీగానే చర్చలు సాగుతూ వస్తున్నాయి. ఇటీవల సైతం పెద్ద ఎత్తున రిటైర్మెంట్ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ సమయంలోనూ రిటైర్మెంట్ వార్తలు వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులతో పాటు కుటుంబం హాజరయ్యారు. దాంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే అందరూ అనుకున్నారు. తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై ధోనీ మౌనం వీడాడు. ఎట్టకేలకు వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ.. ‘నేను ఇంకా ఐపీఎల్ ఆడున్నాను. ప్రస్తుతం నా వయసు 43 సంవత్సరాలు. వచ్చే సీజన్ వరకు జులై నాటికి 44 ఏళ్లు వస్తాయి. మరో సీజన్ ఆడాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు మరో పది నెలల సమయం ఉంది. తాను ఆడాలా? వద్దా ? అనేది నిర్ణయం తీసుకోను. ఆడగలనా? లేదా? అన్న నిర్ణయం శరీరం తీసుకుంటుంది’ అని ధోనీ పేర్కొన్నాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్కు సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. ధోనీతో రిటైర్మెంట్ గురించి చర్చించలేదని తెలిపాడు. అది తన పని కాదని.. నాకేమీ తెలియదని వ్యాఖ్యానించాడు. ధోనీతో కలిసి పని చేయడాన్ని ఆనందిస్తున్నానని.. ఇప్పటికీ బలంగా ముందుకు సాగుతున్నాడన్నాడంటూ స్పందించాడు. అయితే, ఐపీఎల్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన సీఎస్కే.. సీజన్లో ప్రారంభంలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో వరుసగా ఓటమిపాలైంది. ఆ దాంతో జట్టుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ చర్చనీయాంశంగా మారింది. బ్యాటింగ్‌లో ధోనీ ఏడు, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ధోనీ తాను చివరలో బ్యాటింగ్‌కు వచ్చినా.. మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా 0, 30 నాటౌట్, 16, 30 స్కోర్ చేశాడు. తనదైన శైలిలో అత్యద్భుతంగా రెండు స్టంప్ అవుట్స్ చేశాడు. ఇది చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, బ్యాటింగ్‌లో ఇంకా ధోని దూకుడును చూపించి జట్టును గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.