IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025కి రంగం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి టీ20 సమరం మొదలుకానున్నది. లక్నో సూపర్ జెయింట్స్ ఫాన్స్‌కు శుభవార్త. గాయం కారణంగా 2023 సీజన్‌కు దూరమైన ఫాస్ట్ బౌలర్ మయాంకర్ యాదవ్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. మయాంక్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటుండా.. ఐపీఎల్లో ఆడేందుకు ఇంకా బీసీసీఐ నుంచి అనుమతి రాలేదు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. మాయంక్ సీజన్‌కు సైతం అందుబాటులో ఉండకపోవచ్చని పలు మీడియా నివేదికలు తెలిపాయి. అయితే, తాజాగా ఏప్రిల్ రెండో వారం వరకు లక్నో సూపర్ జెయింట్స్‌తో చేరనున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం మయాంక్ నెట్స్‌లో బాగానే బౌలింగ్ చేస్తున్నాడని.. మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మయాంక్ జట్టుతో చేరేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.
మయాంక్ త్వరలో జట్టులో చేరతాడని ఫ్రాంచైజీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 11, 12 వరకు జట్టుతో చేరే అవకాశం ఉందని.. దాంతో సగం మ్యాచులకు దూరమ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులు ఉన్నాయి. మయాంక్ యాదవ్ గత సీజన్లో 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. గాయం కారణంగా 2023 సీజన్‌కు దూరంగా ఉన్నాడు, కానీ, గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మరో మూడు వికెట్ల పడగొట్టాడు. ఈ క్రమంలో రెండు వరుస మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సైడ్ స్ట్రెయిన్ కారణంగా కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే ఆడాడు. లక్నో ఫ్రాంచైజీ అతనిపైగా భారీగానే నమ్మకం పెట్టుకున్నది. మెగా వేలానికి ముందు రూ.11కోట్లతో మయాంక్‌ను రీటైన్ చేసుకుంది. ఈ సారి ఐపీఎల్లో లక్నో జట్టు తొలి మ్యాచ్‌ను 24న విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నది. ఈ సారి రిషబ్ పంత్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు బరిలోకి దిగుతున్నది.