IPL 2025 | ఐపీఎల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండు పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఆర్సీబీ ఆడిన 11 మ్యాచుల్లో ఇది ఎనిమిదో విజయం. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్ ఓడిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. చెన్నై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు తరఫున జాకబ్ బెథెల్ 33 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్లో కోహ్లీకి 62వ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో 500 పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ లీగ్‌లోని 18 సీజన్ల చరిత్రలో అత్యధికంగా 500 పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని, క్రిస్ గేల్, రోహిత్ స్పెషల్ క్లబ్లో చేరాడు.
కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 63.12 సగటు, 143.47 స్ట్రయిక్ రేట్‌తో 505 పరుగులు చేశాడు. ఈ సమయంలో 44 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాడు. కోహ్లీ ఒక సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది ఎనిమిదోసారి. కింగ్ కోహ్లీ అంతకు ముందు 2011, 2013, 2015, 2016, 2018, 2023, 2024 సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ సైతం ఏడుసార్లు కంటే ఎక్కువగా 500 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఆరుసార్లు, శిఖర్ ధావన్ ఐదుసార్లు కంటే 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
సీఎస్కేపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. చెన్నైపై కోహ్లీ 1160 పరుగులు, ఢిల్లీపై 1154 పరుగులు చేశాడు. టీ20లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ ఈ ఘనత సాధించాడు. విరాట్ తర్వాత డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై అత్యధికంగా 1134 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ చెన్నైపై ధావన్ 1105 పరుగులు చేశాడు. కోహ్లీ జట్టు 18 సీజన్లలో తొలిసారిగా ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలో రెండు మ్యాచుల్లో సీఎస్కేని ఓడించింది. బెంగళూరులో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి నాలుగు మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది.
ఆర్సీబీపై ధోనీ సిక్సర్లు 50 బాదాడు. ఎస్ఎస్కే శనివారం మ్యాచ్‌లో ఓటమిపాలైనా ఎనిమిది బంతుల్లో 12 పరుగులు చేసినప్పటికీ స్పెషల్ క్లబ్లో చేరాడు. తన ఇన్నింగ్స్‌లో మహి ఒక సిక్సర్ కొట్టి ఐపీఎల్లో ఒకే జట్టుపై 50.. అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్స్ లిస్టులో చేరాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో, ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. గేల్ పంజాబ్ కింగ్స్‌పై 61 సిక్సర్లు, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 54 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్ 50 సిక్సర్లు బాదాడు.