IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానున్నది. మరో మూడురోజుల్లోనే పొట్టి క్రికెట్ సమరం మొదలుకానున్నది. టోర్నీ ప్రారంభానికి ముందే పలు ఫ్రాంచైజీలకు ఇబ్బందికరంగా మారింది. ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ సహా పలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిపడుతున్నాయి. లీగ్ ప్రారంభమయ్యే సమయానికి ఆయా జట్ల సూపర్ స్టార్స్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడమే కారణంగా. గత ఎడిషన్స్ మాదిరిగానే ఈ సారి ఐపీఎల్ సీజన్లోనూ క్రికెటర్లను గాయాలు వెంటాడుతున్నాయి.
ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వరకు ఈ నెల 22 నుంచి మొదలయ్య లీగ్‌కు అందుబాటులో ఉండడం లేదు. కానీ, లీగ్ సగం వరకైనా అందుబాటులోకి వస్తారా? లేదా? అన్ని సైతం మిలియన్ డాలర్స్ ప్రశ్నగానే మిగిలింది. లక్నోకు చెందిన మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు చెందిన ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ లాకీ ఫెర్గూసన్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ లేదు. ముంబయి ఇండియన్స్ ఇద్దరు బౌలర్ల స్థానంలో ఇతర క్రికెటర్లను తీసుకుంది.
ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్ మధ్యలోనే వైదొలిగాడు. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లాడు. ప్రస్తుతం బుమ్రా ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. వెన్ను నొప్పి కారణంగా ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20లు, వన్డే సిరీస్‌కు.. చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సీజన్ ప్రారంభంలో దూరమైనా..? టోర్నీ మధ్యలోనైనా ఆడుతాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముంబయి బుమ్రా కోసం నిరీక్షిస్తున్నది. బుమ్రా లేకపోతే ముంబయికి పెద్ద దెబ్బ కానున్నది. లక్నోలో ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్, ఆకాష్దీప్, మోహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, షమర్ జోసెఫ్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ సీజన్లో ఆడతాడా లేదా ? అనే దానిపై స్పష్టత లేదు. అదే సమయంలో మోహ్సిన్, అవేష్ ఎన్సీఏలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరు బౌలర్లు లీగ్ ప్రారంభంలో ఆడకపోతే రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టుకు ఇబ్బందికరంగా మారనున్నది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్స్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? సందేహాస్పదంగా ఉన్నది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని వేలికి గాయమైంది. ఇంగ్లాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి వచ్చి తాకడంతో అతడి చూపుడు వేలు విరిగినట్లు సమాచారం. ఆ మ్యాచ్‌లో ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికి సంజు సిక్స్ బాదగా.. ఆ తర్వాత 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన మూడో బంతిని చేతి గ్లవ్‌కు దాకింది. ఫిజియో చికిత్స అందించాడు. ఆ తర్వాత మరో భారీ సిక్సర్, ఫోర్ కొట్టి పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత చేతి వాపు పెరగడంతో పరీక్షలు చేయగా.. వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌కు వెళ్లాడు. ప్రస్తుతం కోలుకున్నాడని.. ఐపీఎల్లో ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే జట్టుతో కలువనున్నట్లు సమాచారం. అందుబాటులో లేకపోతే ధ్రువ్ జురెల్ కీపింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే, సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఆర్సీబీకి చెందిన జోష్ హేజిల్‌వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా ఆస్ట్రేలియా తరఫున చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. ముగ్గురు ఐపీఎల్లో ఆడేందుకు అవకాశం ఉన్నా.. ముగ్గురు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటారో ఎదురుచూడాల్సిందే.