Glenn Maxwell | చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ జరిమానా విధించారు. మాక్స్‌వెల్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ని జోడించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లోని లెవల్ 1 తప్పదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయానికి మ్యాక్స్‌వెల్ సైతం అంగీకరించాడని, దాంతో మ్యాచ్‌ఫీజులో 25శాతం కోత విధిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, మ్యాక్స్‌వెల్ చేసిన తప్పేంటో మాత్రం చెప్పలేదు. సీఎస్కేతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌లో విఫులమయ్యాడు. కేవలం ఒక పరుగు చేసిన పెవిలియన్‌కు చేశాడు. సీఎస్కే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పంజాబ్ జట్టు ప్రస్తుతం నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఒక ఆటగాడికి జరిమానా విధించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లకు జరిమానా విధించారు. వివాదాస్పద రీతిలో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన దిగ్వేష్ రాఠీకి మూడుసార్లు జరిమానా విధించగా.. అదే సమయంలో రిషబ్ పంత్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మొదటి మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రియాన్ పరాగ్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మలకు సైతం జరిమానా విధించారు.