IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ పాల్గొనే బౌలర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ అందించబోతున్నది. సలైవా యూజ్‌పై ప్రస్తుతం ఉన్న బ్యాన్‌ను బీసీసీఐ ఎత్తివేయనున్నది. వాస్తవానికి గతంలో సలైవా (లాలాజలం) వాడడం గతం నుంచి అమలులో ఉన్నా.. కరోనా నేపథ్యంలో ఐసీసీ నిషేధించింది. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ నిషేధం విధించారు. లాలాజలాన్ని ఉపయోగించి.. బౌలర్లు బంతిని షైన్ అయ్యేలా చేసి రివర్స్ సింగ్‌కు ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా ఎఫెక్టివ్ టెక్నిక్. బంతి పాతబడిన సందర్భంలో.. బౌలర్లు సలైవాను ఉపయోగించి బంతిని మెరిసేలా చేస్తూ రివర్స్ స్వింగ్ రాబట్టే అవకాశం ఉండేది. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలు లేకపోవడం, ముప్పు కూడా ఏమీ లేకపోవడంతో బీసీసీఐ బ్యాన్పై నిషేధాన్ని ఎత్తివేయాలని భావిస్తున్నది. గురువారం జరిగే కెప్టెన్ల సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తున్నది. బ్యాన్పై కెప్టెన్లు అందరూ ఏకాభిప్రాయానికి వస్తే సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
గతంలో టీమిండియా ఫాస్ బౌలర్ మహ్మద్ షమీ సైతం సలైవా వాడేందుకు అనుమతి ఇవ్వాలని ఐసీసీని కోరాడు. బౌలర్లు సలైవా వినియోగించడం తప్పనిసరని.. లేకపోతే బ్యాట్స్‌మెన్‌కు పూర్తిగా అనుకూలంగా ఉంటుందని షమీ పేర్కొన్నారు. బౌలర్లు రివర్స్ స్వింగ్‌కు ప్రయత్నిస్తామని.. కానీ, సలైవా వాడడానికి అనుమతి లేదని.. బ్యాన్ ఎత్తివేయాలని కోరుతున్నామని.. రివర్స్ స్వింగ్ ఆటను ఆసక్తికరంగా మారుస్తుందని తెలిపాడు. దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నన్ ఫిలాండర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టీమ్ సౌతి సహా పలువురు ప్లేయర్లు సలైవా వాడుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీనిపై ఇప్పటి వరకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ఐపీఎల్లో బ్యాన్ ఎత్తివేస్తే మాత్రం బౌలర్లకు ఎంతో ఊరట కలుగనున్నది. ఇదే జరిగితే బ్యాట్‌కు, బంతికి మధ్య జరిగే పోరాటం ఆసక్తికరంగా మారనున్నది.
ఇప్పటి వరకు డీఆర్ఎస్ కేవలం అవుట్, నాటౌట్, నోబాల్, వైడ్‌బాల్ వరకు మాత్రమే ఐపీఎల్లో వినియోగిస్తున్నారు. తాజాగా ఈ సీజన్ నుంచి హైట్ వైడ్బాల్కు సైతం డీఆర్ఎస్ను వాడనున్నట్లు సమాచారం. బ్యాటర్‌పై నుంచి బంతి ఎక్కువ ఎత్తు నుంచి వెళ్లిన సందర్భంలో వైడ్ బాల్ అవునో.. కాదో తెలుసుకునేందుకు డీఆర్ఎస్ను వాడుకునేందుకు ప్లేయర్స్‌కు అనుమతి లభించనున్నది. దాంతో ఆట మరింత ఆసక్తికరంగా మారనున్నది. తాజాగా ఈ నిబంధనపై సైతం కెప్టెన్ల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్ 18వ ఎడిషన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనున్నది. ఈ సంవత్సరం 65 రోజుల్లో 13 వేదికల్లో 10 జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచులు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచులు ఉంటాయి. ఫైనల్‌తో సహా ప్లేఆఫ్ మ్యాచులన్నీ మే 20 నుంచి 25 వరకు హైదరాబాద్, కోల్‌కతాలో జరుగుతాయి. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫయర్-2, ఫైనల్‌కు కోల్‌కతా ఆతిథ్యం ఇస్తుంది. ఐపీఎల్-2025లో మొత్తం 12 డబుల్ హెడర్లు ఉంటాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు.. రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది.