IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడగా.. రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ ఓడిన రెండు మ్యాచులు సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలోనే కావడం గమనార్హం. ఆర్సీబీ సొంత మైదానం అస్సలు కలిసిరావడం లేదు. దీనికి గణాంకాలే నిదర్శనం. ఆర్సీబీ ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియంలో 93 మ్యాచులు ఆడగా.. ఇందులో 43 మాత్రమే గెలిచి.. 45 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. నాలుగు మ్యాచులు ఫలితం తేలకుండానే ముగిశాయి. ఈ క్రమంలో ఆర్సీబీ మెంటార్ దినేశ్ కార్తీక్ హోం గ్రౌండ్ పిచ్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. తాము బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ను డిమాండ్ చేసినప్పటికీ.. ఈ సీజన్లో జట్టుకు సవాల్‌తో కూడుకున్న పిచ్‌లు ఉన్నాయన్నారు. ఇంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే సైతం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. టీమ్ మేనేజ్మెంట్ త్వరలోనే క్యూరేటర్‌తో మాట్లాడుతుందని కార్తీక్ తెలిపాడు.
అయితే, పిచ్ స్లోగా ఉండడంతో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఎనిమిది వికెట్లకు 169, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కార్తీకి మాట్లాడుతూ తొలి రెండు మ్యాచుల్లో మంచి పిచ్‌ను సిద్ధం చేయాలని తాము కోరామని.. కానీ, బ్యాటింగ్‌కు సవాల్‌తో కూడుకున్న పిచ్ తమకు లభించిందని.. పరిస్థితులకు అనుగుణంగా తాము తమవంతు ప్రయత్నం చేశామని చెప్పాడు. క్యూరేటర్‌తో మాట్లాడాలని.. తన పనిని బాగా చేస్తాయనే పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. రెండు మ్యాచుల్లో పిచ్ ఒకేలా ఉందని.. బ్యాట్స్‌మెన్‌కు సహకరించని పిచ్ దొరకలేదని తెలిపాడు. టీ20 క్రికెట్లో లాంగ్ షాట్లు, ఫోర్లు, సిక్సర్లు కీలకమైనవని.. టీ20 క్రికెట్ స్వభావం ఏమిటంటే.. అందులో ఎక్కువ పరుగులు చేస్తే.. బ్రాడ్‌కాస్టర్ అంతగా ప్రయోజనం పొందుతారని.. అభిమానులు సైతం సంతోషంగా ఉంటారన్నారు. వారందరూ ఫోర్లు, సిక్సర్లు చూడాలనుకుంటారని.. దాని కోసం తమవంతు పని చేస్తామని చెప్పాడు. ప్రస్తుత చిన్నస్వామి పిచ్‌ను అర్థం చేసుకోవడం.. భారీ షాట్లు ఆడడం సులభం కాదని తెలిపాడు.
టీ20లో కొన్ని షాట్స్ ఆడాల్సి ఉంటుందని.. ఈ ప్రయత్నంలోనే వికెట్ కోల్పోవచ్చని చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆర్సీబీ బెంగళూరు చేతిలో కేకేఆర్ ఓటమిపాలైంది. ఆ తర్వాత పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో స్పిన్-ఫ్రెండ్లీ ట్రాక్‌ను చూడాలని తాను ఆశిస్తున్నానని చెప్పాడు. స్పిన్ బౌలర్లకు సహాయపడే పిచ్‌ను చూడాలని తాము కోరుకుంటున్నామని చెప్పాడు. ఆ తర్వాత ఓ స్పోర్ట్స్ చానెల్‌తో పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ మాట్లాడారు. సుజన్ పిచ్‌లో ఎలాంటి మార్పులు చేయబోనని తెలిపారు. ఆర్సీబీ స్పిన్నర్స్‌ను ఉదహరించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఫ్రాంచైజీలకు పిచ్ గురించి ఎలాంటి అభిప్రాయం లేదని.. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇక్కడి పిచ్‌లు ఇలాగే ఉన్నాయని.. ఇది గతంలో కూడా అలాగే ఉందని తెలిపాడు. ఇప్పుడు పరిస్థితులు మారలేదని.. భవిష్యత్తులో మారబోదన్నారు. ఆర్సీబీ స్పిన్నర్లు నాలుగు వికెట్లు తీస్తే.. కేకేఆర్ స్పిన్నర్లు ఏం చేశారని ప్రశ్నించాడు. ఈ వికెట్‌పై కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ టర్న్ రాబడుతూ.. రస్సెల్‌ను ఇబ్బందిపెట్టాడని చెప్పాడు. ఆ తర్వాత ఆయనపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. కేకేఆర్ నుంచి ఏ వచ్చిన అభ్యర్థలను తిరస్కరించలేదన్నారు.