IPL2024 | సూర్యకుమార్ వచ్చేది అప్పుడే..! కీలక అప్డేట్ ఇచ్చిన పీయూష్ చావ్లా..!
Surya Kumar Yadav | ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఎంఐ ఓటమిపాలైంది. గాయం కారణంగా దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడే జట్టుతో చేరబోవడం లేదని తెలుస్తున్నది.
IPL2024 | ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఎంఐ ఓటమిపాలైంది. గాయం కారణంగా దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడే జట్టుతో చేరబోవడం లేదని తెలుస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. సూర్య గైర్హాజరీతో ముంబయి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని జట్టు ఓటమిపాలైంది. ఇక మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్నది. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టు సొంత మైదానంలో తొలి మ్యాచ్ ఆడనుంది.
సూర్య ఎంట్రీపై అప్డేట్ ఇచ్చిన పీయూష్ చావ్లా
వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌తో తలపడనున్నది. రెండు మ్యాచ్‌లు ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబయి ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. సూర్య ఎప్పటి నుంచి జట్టుతో కలుస్తాడనే చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జట్టు స్పిన్నర్ పీయూష్ చావ్లా కీలక అప్డేట్ ఇచ్చాడు. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సమాచారం జట్టు ఎదురుచూస్తోందని చెప్పాడు. ఎన్సీఏ ఇప్పటికీ సూర్య ఫిట్నెస్ను పర్యవేక్షిస్తుందని తెలిపాడు. సూర్య కుమార్ ఐపీఎల్-2023లో ముంబయి తరఫున 600పైగా పరుగులు సాధించాడు. డిసెంబర్ 2023 నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు.
టీ20 వరల్డ్ కప్‌కి ముందు..
దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టీ20 మ్యాచ్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. ఇంతకు ముందు బీసీసీఐ వర్గాలు సైతం సూర్యకుమార్ ముంబయి ఆడే పలు మ్యాచులకు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలిపాయి. ముంబయి ఇండియన్స్ జట్టులో సూర్య కుమార్ కీలకమైన ఆటగాడు కాగా.. 2022 మెగా వేలానికి ముందు సూర్య కుమార్ యాదవ్‌ను ఎంఐ రిటైన్ చేసుకుంది. ముంబయి తరఫున 85 మ్యాచ్‌లు ఆడి 2,641 పరుగులు చేశాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూర్య ఫిట్నెస్ కీలకంగా మారింది. ఐసీసీ T20 ప్రపంచ కప్‌ను అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం ఏప్రిల్ చివరి వారంలోగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో బెర్తు లభించే అవకాశం ఉన్నది. ఇక టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్య ఫిట్‌నెట్ ఆందోళనకు గురి చేస్తున్నది. అయితే, త్వరలోనే సూర్యకుమార్ మైదానంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

