MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలం ముగియగడంతో అన్ని ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ఈ సీజన్‌తో కొందరు దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే చాన్స్ ఉంది. వాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) సారథి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఒకడు. నిజానికి 16వ సీజన్‌తోనే ధోనీ తప్పుకుంటాడనే వార్తలు వినిపించాయి. కానీ, మహీ మరో సీజన్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో 17వ సీజన్‌తో ధోనీ ఐపీఎల్ కెరీర్‌ను ముగిస్తాడనే జోరుగా చర్చ నడుస్తోంది.
అయితే.. ధోనీ రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ సీఈఓ కాశి విశ్వనాథన్(Kasi Vishwanathan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో సీజన్ ఆడాలా? వద్దా? అనేది ధోనీ మాత్రమే చెప్పాలి అని ఆయన అన్నాడు. ‘ధోనీ మరో సీజన్ ఆడతాడా? లేదా? అనేది నాకు తెలియదు. అయితే.. కెప్టెన్ అయిన మహీ స్వయంగా తన నిర్ణయం మీ అందరికి తెలియజేస్తాడు. అతడు ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేది మాకు చెప్పడు, మోకాలి సర్జరీ(Knee Surgery) నుంచి కోలుకుంటున్న ధోనీ ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. వచ్చే 10 రోజుల్లో అతడు నెట్స్‌లో సాధన చేస్తాడు’ అని విశ్వనాథ్ తెలిపాడు.
మహేంద్ర సింగ్ ధోనీ
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్లో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. 16వ సీజన్లో సీఎస్కేను విజేతగా నిలిపిన మహీ.. ఐదోసారి ట్రోఫీ అందించిన సారథిగా రికార్డు సృష్టించాడు. ఇక డిసెంబర్ 19న ముగిసిన మినీ వేలంలో చెన్నై గెలుపు గుర్రాలను కొన్నది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్లు డారిల్ మిచెల్(Daryl Mitchell)ను రూ.14 కోట్లకు, యువకెరటం రచిన్ రవీంద్ర(Rachin Ravindra)ను అగ్గువకే సొంతం చేసుకుంది. అంతేకాదు అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీని రూ.8.4 కోట్లకు దక్కించుకుంది. అంతేకాదు మాజీ సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్‌ను సైతం సొంత గూటికి తెచ్చుకుంది.