Heart Attack | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో చోటు చేసుకున్నది. కాగాజ్నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబల్గా పని చేస్తున్న జీ దయానంద్ (55) డ్యూటీలో ఉన్న సమయంలో శనివారం గుండెపోటు వచ్చింది. బ్లూకోట్ విధుల్లో భాగంగా నజ్రుల్‌నగర్ మార్కెట్‌కు వెళ్లగా రాత్రి అక్కడే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. మార్కెట్లోని పలువురు ఈస్గాం ఠాణా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తోటి పోలీసులు తమ వాహనంలో అతడిని తీసుకుని కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు.