US Shooting | అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. మాల్లో కాల్పులు.. ఒకరి మృతి
US Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. క్రిస్మస్కు ముందు ఫ్లోరిడాలోని ఓ మాల్లో కాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయాలకు గురైంది.
US Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. క్రిస్మస్కు ముందు ఫ్లోరిడాలోని ఓ మాల్లో కాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయాలకు గురైంది. ఫ్లోరిడాలోని ఓకాలా మాల్లో కాల్పుల ఘటన జరిందని ఓకాలా పోలీస్ చీఫ్ మైక్ బాల్కెన్ తెలిపారు. ప్యాడాక్ మాల్లో పలు రౌండ్ల కాల్పులు జరిగాయని, ఆ తర్వాత పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు. తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
మరో మహిళ కాలికి తూట గాయమైందని పేర్కొన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు బాల్కెన్ పేర్కొన్నారు. మాల్లో తన తల్లితో కలిసి షాపింగ్ చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయని, ఆ తర్వాత గందరగోళం నెలకొందని స్థానికులు తెలిపారు. కాల్పుల ఘటనపై మాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర ఘటన అని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

