PBKS vs GT | సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. గుజరాత్ బౌలర్ల ధాటికి 13 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్లో రెండో బంతికి లివింగ్‌స్టోన్ (6) ఔటవ్వగా.. 12వ ఓవర్లో నాలుగో బంతికి జితేశ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. పవర్ ప్లే పూర్తయ్యేలోపే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరో ఓవర్లో మూడో బంతికి భారీ షాట్‌కు యత్నించి ప్రభ్‌సిమ్రన్ (35) ఔటయ్యాడు. ఆ తర్వాత ఏడో ఓవర్లో చివరి బంతికి రొస్సోవ్ (9).. ఎనిమిదో ఓవర్లో ఐదో బంతికి కరన్ (20) ఔటయ్యారు. ఈ రెండు వికెట్ల విషయంలో పంజాబ్ రివ్యూకు వెళ్లినప్పటికీ పంజాబ్‌కు వ్యతిరేకంగానే ఫలితం వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్న సమయంలో 11 ఓవర్‌కు లివింగ్ స్టోన్.. తెవాటియాకు చిక్కాడు. 12వ ఓవర్లో నాలుగో బంతికి జితేశ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోర్ 90/5.