IPL 2024: రెండేండ్ల క్రితమే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినా వరుసగా రెండుసార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టు లక్నో సూపర్ జెయింట్స్. కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో.. కొద్దిరోజుల ముందే హెడ్‌కోచ్ ఆండీ ప్లవర్‌ను మార్చగా తాజాగా బ్యాటింగ్ కోచ్‌కూ గుడ్ బై చెప్పింది. రెండు సీజన్ల పాటు లక్నోకు బ్యాటింగ్ కోచ్‌గా చేసిన విజయ్ దహియాకు ఆ జట్టు వీడ్కోలు పలకింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటన చేసింది.
దహియా స్థానంలో ఇంకా ఎవరినీ నియమించనప్పటికీ టీమిండియా మాజీ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్‌గా పేరున్న సురేశ్ రైనాకు ఈ అవకాశం దక్కనున్నట్టు తెలుస్తున్నది. ఆండీ ప్లవర్తో పాటు మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా లక్నోను వీడిన విషయం తెలిసిందే. గంభీర్ స్థానంలో మెంటార్‌గా రైనాను తీసుకుంటారని కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దహియా కూడా లక్నోకు గుడ్ బై చెప్పడంతో రైనాను మెంటార్ కమ్ బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై లక్నో యాజమాన్యం త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నది. దహియాకు గుడ్ బై చెప్పిన లక్నో.. శ్రీధరన్ శ్రీరామ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.
All the best for your next chapter, @vijdahiya !🙏💙 pic.twitter.com/7RhyyOuXnD
— Lucknow Super Giants (@LucknowIPL) January 1, 2024
ప్రస్తుతం లక్నో కోచింగ్ సిబ్బంది :
– హెడ్‌కోచ్ : జస్టిన్ లంగర్
– అసిస్టెంట్ కోచ్ : శ్రీధరన్ శ్రీరామ్
– ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : మోర్నీ మోర్కెల్
– ఫీల్డింగ్ కోచ్ : జాంటీ రోడ్స్
– స్పిన్ బౌలింగ్ కోచ్ : ప్రవీణ్ తాంబె