KKR vs RCB | ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు వరుస వికెట్లను కోల్పోతుంది. కోల్‌కతా బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 12వ ఓవర్లో ఆర్బీసీ రెండు వికెట్లను కోల్పోయింది. తొలి బంతిలో జాక్స్ (55) ఔటవ్వగా.. నాలుగో బంతికి రజత్ (52) హర్షత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13వ ఓవర్లోనూ మరో రెండు వికెట్లు కోల్పోయాయి. మూడో బంతికి గ్రీన్ (6) ఔటవ్వగా.. చివరి బంతికి లామ్రార్ (4) కూడా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్బీసీ 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో ప్రభుదేశాయి (9), దినేశ్ కార్తిక్ (5) ఉన్నారు.