KKR vs RCB | బెంగళూరుతో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 14వ ఓవర్లో మొదటి బంతికి రింకూ సింగ్ (24)ఔటయ్యాడు. ఫెర్గూసన్ వేసిన స్లో బంతిని ఆడే క్రమంలో యశ్ దయాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కోల్‌కతా బ్యాటర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ చెలరేగి ఆడాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 4.2 ఓవర్ వద్ద సిరాజ్ వేసిన బంతికి భారీ షాట్‌కు యత్నినంచి ఔటయ్యాడు. దీంతో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 10 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(3), వెంకటేశ్ అయ్యర్ (16) ప్రభావం చూపించలేకపోయారు. కానీ శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్ దూకుడుగా ఆడుతూ జట్టుకు కీలక స్కోర్ అందించారు. కానీ 13.1 ఓవర్లో రింకూ సింగ్ కూడా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 142/5.