IPL 2024 | 12 భాషల్లో ప్రసారాలు.. ఐపీఎల్‌ను వినిపించేది వీళ్లే..! కామెంటేటర్స్ లిస్ట్ రిలీజ్ చేసిన జియో
IPL 2024 | అత్యాధునిక టెక్నాలజీతో, సరికొత్త హంగులతో అభిమానులకు ఐపీఎల్ మొబైల్ ప్రసారాలతో మరింత ఉత్తేజపరిచేందుకు గాను జియో అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేసింది. తాజాగా జియో.. 12 భాషలకు చెందిన కామెంటేటర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది.
IPL 2024 | త్వరలో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ డిజిటల్ ప్రసారాలను జియో ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీతో, సరికొత్త హంగులతో అభిమానులకు ఐపీఎల్ మొబైల్ ప్రసారాలతో మరింత ఉత్తేజపరిచేందుకు గాను జియో అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేసింది. తాజాగా జియో.. 12 భాషలకు చెందిన కామెంటేటర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ జియో ఈ ప్రసారాలను ఉచితంగానే అందిస్తోంది.
ఇంగ్లీష్, హిందీతో పాటు గుజరాతి, భోజ్‌పురి, బెంగాలీ, హర్యాన్వి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబిలలో ప్రసారాలను అందించనుంది. ఇంగ్లీష్ కామెంట్రీని దిగ్గజ క్రికెటర్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, బ్రెట్ లీ అనిల్ కుంబ్లే, రాబిన్ ఊతప్ప, గ్రేమ్ స్మిత్, స్కాట్ స్టైరిస్లు అందించనున్నారు. హిందీ కామెంట్రీని జహీర్ ఖాన్, సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, ఆకాశ్ చోప్రా వంటి మాజీలు చెప్పనున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ హర్యానా భాషలో కామెంట్రీ చెప్పనుండటం విశేషం.
దక్షిణాది భాషల్లో ముఖ్యంగా తెలుగులో భారత టెస్టు క్రికెటర్ హనుమా విహారితో పాటు మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, అశిశ్ రెడ్డి, సందీప్ బవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, ప్రత్యూష, ఆర్జే కౌశిక్, సునితా ఆనంద్‌లు కామెంట్రీ వినిపించనున్నారు.
🚨 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐦𝐞𝐧𝐭 🚨
Get ready for an exclusive sneak peek at our star-studded commentary panel for #TATAIPL on #JioCinema! #IPL2024 #JioCinemaSports #IPLonJioCinema pic.twitter.com/RI5EoNx7mT
— JioCinema (@JioCinema) March 19, 2024
ఇక ఐపీఎల్ టీవీ పార్ట్నర్ అయిన స్టార్ కూడా భారీ కామెంటేటర్స్ లిస్ట్‌ను మూడు రోజుల క్రితమే ప్రకటించింది. స్టార్ కూడా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాతి, బంగ్లా (బెంగాళి) భాషల్లో ప్రసారాలను అందించనుంది. తెలుగులో అంబటి రాయుడు, మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్రావు, రాకేశ్ దేవ రెడ్డి, డానియల్ మనోహర్, శశికాంత్ ఆవులపల్లి, రవి రక్లీ, ఆనంద్ శ్రీ కృష్ణ, వింధ్యా మేడపాటి, గీతా భగత్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్టార్ స్పోర్ట్స్‌లో కామెంట్రీ చెప్పనుండటం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

