IPL 2023 : ఉప్పల్ స్టేడియం సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తిపోయింది. విరాట్ కోహ్లీ(100 : 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(71) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 14 పాయింట్లతో ఓ అడుగు ముందుకేసింది. మొదట హెన్రిచ్ క్లాసెన్(104 : 49 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఐపీఎల్లో తొలి సెంచరీ బాది హైదరాబాద్‌కు భారీ స్కోర్ అందించాడు.
KING KOHLI 👑
What a knock this has been! @imVkohli has wowed one and all with his masterful century in Hyderabad.
This is his 6th in #TATAIPL, the joint-most in the history of the league with Chris Gayle.#SRHvRCB pic.twitter.com/G49dbi8bLJ
— IndianPremierLeague (@IPL) May 18, 2023
కార్తిక్ త్యాగి వేసిన 20వ ఓవర్లో మైఖేల్ బ్రేస్‌వెల్(4) రెండు రన్స్ తీశాడు. దాంతో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఓ అడుగు ముందుకేసింది. మ్యాక్స్‌వెల్(5) నాటౌట్‌గా నిలిచాడు.
ఫాఫ్ డూప్లెసిస్(71) ఔటయ్యాడు. నటరాజన్ ఓవర్లో త్రిపాఠి చేతికి చిక్కాడు. దాంతో, 177 వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు ఓవర్లో సెంచరీ హీరో విరాట్ కోహ్లీ(100) వెనుదిరిగాడు.
విరాట్ కోహ్లీ(100) సెంచరీ బాదాడు. భువనేశ్వర్ ఓవర్లో సిక్సర్‌తో శతకం సాధించాడు. ఐపీఎల్లో అతడికి ఇది ఆరో సెంచరీ.
హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ(82) చెలరేగి ఆడుతున్నాడు. భువనేశ్వర్ ఓవర్లో అతను నాలుగు బౌండరీలు కొట్టాడు. 18 పరుగులు వచ్చాయి. దాంతో, ఆర్సీబీ 150 దాటింది. ఫాఫ్ డూప్లెసిస్(63) క్రీజులో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ(55) కూడా హాఫ్ సెంచరీ బాదాడు. గ్లెన్ ఫిలిఫ్స్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ 100 దాటింది. ఫాఫ్ డూప్లెసిస్(51) క్రీజులో ఉన్నాడు. 12 ఓవర్లకు స్కోర్.. 108/0.
Virat Kohli joins the party with a fine half-century off 35 deliveries.
His 7th in #TATAIPL 2023.
Live - https://t.co/stBkLWKOUk #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/cU5LyIYwFU
— IndianPremierLeague (@IPL) May 18, 2023
దంచి కొడుతున్న ఫాఫ్ డూప్లెసిస్(50) హాఫ్ సెంచరీ బాదాడు. గ్లెన్ ఫిలిఫ్స్ ఓవర్లో రెండు రన్స్ తీసి ఫిఫ్టీ సాధించాడు.
దంచి కొడుతున్న ఫాఫ్ డూప్లెసిస్(46) రివ్యూతో బతికిపోయాడు. నితీశ్ రెడ్డి ఓవర్లో మయాంక్ దగర్ క్యాచ్ పట్టడంతో అంపైర్ ఔటిచ్చాడు. వెంటనే డూప్లెసిస్ రివ్యూ తీసుకున్నాడు. అంపైర్ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించి, ఫ్రీ హిట్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ(42) ఉతుకుతున్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 90/0
ఆర్సీబీ ఫాఫ్ డూప్లెసిస్(34), విరాట్ కోహ్లీ(29) పవర్ ప్లేలో దంచికొట్టారు. దాంతో, 6 ఓవర్లకు స్కోర్.. 64/0 గా ఉంది.
#RCB have got off to a flying start.
A brilliant 50-run partnership comes up between Faf du Plessis and Virat Kohli.
Live - https://t.co/stBkLWKOUk #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/axHsWEXSaK
— IndianPremierLeague (@IPL) May 18, 2023
ఫాఫ్ డూప్లెసిస్(30) వీర కొట్టుడు కొడుతున్నాడు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, ఆర్సీబీ 50 దాటింది. విరాట్ కోహ్లీ(28)ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 59/0
కార్తిక్ త్యాగి ఓవర్లో ఫాఫ్ డూప్లెసిస్(17) హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. రెండో బంతికి అతడికి లైఫ్ దొరికింది. బౌండరీ వద్ద గ్లెన్ ఫిలిఫ్స్ క్యాచ్ వదిలేశాడు. ఐదో బంతికి విరాట్ కోహ్లీ(27) బౌండరీ బాదాడు. 18 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు స్కోర్.. 45/0
విరాట్ కోహ్లీ(17) దంచుతున్నాడు. అభిషేక్ శర్మ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. 11 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(0) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు స్కోర్.. 20/0
భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో విరాట్ కోహ్లీ(8) దంచాడు. తొలి రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. 8 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(0) క్రీజులో ఉన్నాడు.
సిరాజ్ వేసిన 20వ ఓవర్లో ఆఖరి బంతికి గ్లెన్ ఫిలిఫ్స్(5) ఔటయ్యాడు. అతను కొట్టిన బంతిని బౌండరీ వద్ద పార్నెల్ అందుకున్నాడు. హ్యారీ బ్రూక్(27) నాటౌట్‌గా నిలిచాడు. దాంతో, . హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
విధ్వంసక బ్యాటింగ్ చేస్తున్నహెన్రిచ్ క్లాసెన్(104) సెంచరీ కొట్టాడు.హర్షల్ పటేల్ ఓవర్లో సిక్స్ కొట్టి వందకు చేరువయ్యాడు. అతను 49 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో శతకం సాధించాడు.
CENTURY for Heinrich Klaasen 👏💪🔥
He lights up the Hyderabad sky with a scintillating 💯
Take a bow, Klaasen!#TATAIPL #SRHvRCB pic.twitter.com/VVmRcPvaKd
— IndianPremierLeague (@IPL) May 18, 2023
హెన్రిచ్ క్లాసెన్(93) విధ్వంసక బ్యాటింగ్ చేస్తున్నాడు. షహబాజ్ అహ్మద్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో, హైదరాబాద్ స్కోర్ 150 దాటింది. హ్యారీ బ్రూక్(21) ధాటిగా ఆడుతున్నాడు. 17 ఓవర్లకు స్కోర్.. 160/3
హెన్రిచ్ క్లాసెన్(79), హ్యారీ బ్రూక్(16) ధాటిగా ఆడుతున్నారు. దాంతో, హైదరాబాద్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. 16 ఓవర్లకు స్కోర్.. 141/3
హెన్రిచ్ క్లాసెన్(38) ధనాధన్ ఆడుతున్నాడు. కరన్ శర్మ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. 11 పరుగులు వచ్చాయి. ఎయిడెన్ మరక్రం(11) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 76/2
హైదరాబాద్ స్కోర్ 50 దాటింది. హెన్రిచ్ క్లాసెన్(25), ఎయిడెన్ మరక్రం(4) వేగంగా ఆడుతున్నారు. 7 ఓవర్లకు స్కోర్.. 56/2
ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్(20) దూకుడుగా ఆడుతున్నాడు. షహబాజ్ అహ్మద్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టాడు. ఎయిడెన్ మరక్రం(2) క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు స్కోర్..49/2
హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(15) ని మైఖేల్ బ్రేస్‌వెల్ పెవిలియన్ పంపాడు. స్వీప్ షాట్ ఆడిన త్రిపాఠి, హర్షల్ పటేల్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్(5) బౌండరీ కొట్టాడు. ఎయిడెన్ మరక్రం(1) క్రీజులో ఉన్నాడు. ఓవర్లో తొలి బంతికి మహిపాల్ లొమ్రోర్ క్యాచ్ క్యాచ్ పట్టడంతో అభిషేక్ శర్మ(11) ఔటయ్యాడు. 5 ఓవర్లకు స్కోర్..32/2.
Bracewell is on 🔥🔥
Picks up two wickets in a span of three deliveries.
Abishek Sharma and Rahul Tripathi depart.
Live - https://t.co/stBkLWLmJS #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/puKMiWqsON
— IndianPremierLeague (@IPL) May 18, 2023
హైదరాబాద్‌కు షాక్ .. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ(11) ఔటయ్యాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓవర్లో తొలి బంతికి మహిపాల్ లొమ్రోర్ క్యాచ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 27 రన్స్ వద్ద హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఎయిడెన్ మరక్రం వచ్చాడు. రాహుల్ త్రిపాఠి(15) క్రీజులో ఉన్నాడు.
ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి(15), అభిషేక్ శర్మ(11) దంచుతున్నారు. వేన్ పార్నెల్ వేసిన నాలుగో ఓవర్లో రెండు, మూడు బంతులకు ఫోర్, సిక్స్ బాదాడు. నాలుగో బంతికి అభిషేక్ బౌండరీ రాబట్టాడు. 16 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు స్కోర్..27/0.
సిరాజ్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ(6) క్యాచ్ ఔట్ కోసం ఆర్సీబీ రివ్యూ తీసుకుంది. కానీ, రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదు. దాంతో, రివ్యూ వృథా అయింది. ఆ తర్వాత బంతికే అతను ఫోర్ బాదాడు. ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి(4)రనౌట్ తప్పించుకున్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 11/0.
వేన్ పార్నెల్ వేసిన రెండో ఓవర్లో రాహుల్ త్రిపాఠి(4) ఆఖరి బంతికి బౌండరీ కొట్టాడు. 5 పరుగులు వచ్చాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ(2) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు స్కోర్.. 7/0.
సిరాజ్ తొలి బంతి వైడ్ వేశాడు. 2 పరుగులు వచ్చాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ(1), రాహుల్ త్రిపాఠి(0) క్రీజులో ఉన్నారు.
హైదరాబాద్ - మయాంక్ మార్కండు, నటరాజన్, వివ్రాంత్ శర్మ, సన్వీర్ సింగ్, అకీల్ హొసేన్.
ఆర్సీబీ - దినేశ్ కార్తిక్, విజయ్‌కుమార్, హిమాన్షు శర్మ, సుయాశ్ ప్రభుదేశాయ్, కేదార్ జాదవ్.
హైదరాబాద్ : అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మరక్రం(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిఫ్స్, అబ్దుల్ సమద్, కార్తిక్ త్యాగి, మయాంక్ దగర్, భువనేశ్వర్ కుమార్, నితీవ్ రెడ్డి
ఆర్సీబీ : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), మ్యాక్స్‌వెల్, మహిపాల్ లొమ్రోర్, మైఖేల్ బ్రాస్‌వెల్, అనుజ్ రావత్, షహబాజ్ అహ్మద్, వేన్ పార్నెల్, సిరాజ్, హర్షల్ పటేల్, కరన్ శర్మ.
A look at the Playing XI for #SRHvRCB
Live - https://t.co/stBkLWLmJS #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/EMyXzfHubV
— IndianPremierLeague (@IPL) May 18, 2023
ఉప్పల్ స్టేడియంలో జాతిరత్నాలు ఫేం నవీన్ పోలిశెట్టి, నందు సందడి చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఆర్సీబీ, హైదరాబాద్ ఫ్యాన్స్‌తో మాట్లాడారు. నవీన్ నటించిన మిస్టర్ శెట్టి, మిసెస్ శెట్టి సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మొదట బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.