Maruti Suzuki – Swift Facelift | మారుతి సుజుకి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు `స్విఫ్ట్` అప్డేటెడ్ వర్షన్ కోసం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా గానీ, ఎరెనా డీలర్‌షిప్‌లో గానీ రూ.11 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల తొమ్మిదో తేదీన `స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్` వర్షన్ కారును మారుతి సుజుకి ఆవిష్కరించనున్నది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం `స్విఫ్ట్` కారు జడ్-సిరీస్ 1.2-లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. కొత్త ఇంజిన్ లీటర్ పెట్రోల్ మీద సుమారు 40 కి.మీ మైలేజీ ఇస్తుందని ప్రకటించింది.నెక్ట్స్ జనరేషన్ `స్విఫ్ట్` కారు అడాస్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతోపాటు 6-ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తున్నది. జపాన్ రాజధాని టోక్యోలో ఇటీవల నిర్వహించిన ఆటోషోలో ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును మారుతి సుజుకి మాతృసంస్థ `సుజుకి మోటార్ కార్పొరేషన్` ప్రదర్శించింది.
ప్రస్తుత మోడల్ `స్విఫ్ట్` కారు ధర రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ఫీచర్లు, కొత్త డిజైన్‌తో `స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్` కారు ధర రూ.6.3 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10, టాటా టియాగో కార్లకు మారుతి `న్యూ` స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.
నూతన తరం `స్విఫ్ట్` కారు ఫ్రంట్‌లో షార్ఫ్ లుకింగ్ హెడ్ ల్యాంప్స్ విత్ ప్రొజెక్టర్ సెటప్, ఇన్‌బిల్ట్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, రెండు హెడ్‌ల్యాంప్స్ మధ్య రీ డిజైన్డ్ హానీ కాంబ్ ప్యాటర్న్ బ్లాక్ గ్రిల్లె విత్ డార్క్ క్రోమ్ ఫినిష్ ఉంటాయి. బాయ్నెట్ దిగువన, గ్రిల్లెకు ఎగువన కంపెనీ లోగో అమరుస్తారు. ఫ్రంట్ బంఫర్, ఫ్రంట్ ఫాగ్ లాంప్ భిన్నంగా ఉంటాయి. ఇంతకుముందు కంటే మెరుగ్గా క్లీన్ చేసేలా ఉంటాయి. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మినహా సైడ్ ప్రొఫైల్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. రేర్‌లో టెయిల్ లైట్స్ యధాతథంగా కొనసాగుతాయి. టెయిల్ గేట్‌పై హైబ్రీడ్ బ్యాడ్జింగ్‌తో ప్రస్తుత మోడల్ `స్విఫ్ట్` కంటే స్పోర్టియర్‌గా ఉంటుంది. హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా న్యూ జెన్ స్విఫ్ట్ రూపుదిద్దుకున్నది.
మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌గా కొత్త ఫీచర్లు జత చేశారు. ఫోర్డ్ ఫిగో, మారుతి బాలెనో, మారుతి బ్రెజాలో మాదిరిగా ఆల్ న్యూ డాష్‌బోర్డ్ లే ఔట్ విత్ బ్లాక్ అండ్ వైట్ డ్యుయల్ టోన్ థీమ్ జత చేశారు. న్యూ డాష్ బోర్డ్ లే ఔట్ 9.0 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్లీక్ ఏసీ వెంట్స్, దిగువన హవాక్ కంట్రోల్స్ ఉంటాయి. ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు జత చేశారు.
మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ కారులో న్యూ జడ్- సిరీస్ 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వినియోగిస్తారు. జడ్-సిరీస్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 90 హెచ్‌పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ కే12 ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వినియోగించారు. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సీఎన్జీ అండ్ హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. 360-డిగ్రీ కెమెరా, పలు అడాస్ ఫీచర్లు, డ్యుయల్ సెన్సర్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొల్లిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 6-ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.