వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. అభిషేక్, క్లాసెన్ హాఫ్‌సెంచరీలతో మంచి స్కోరు చేసిన రైజర్స్.. ఆనక బౌలింగ్‌లోనూ ఆకట్టుకొని ఐపీఎల్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది.
ఢిల్లీ: ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67; 12 ఫోర్లు, ఒక సిక్సర్), వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన రెండో పోరులో రైజర్స్ 9 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. అభిషేక్, క్లాసెన్ అర్ధశతకాలు సాధించగా.. అబ్దుల్ సమద్ (28) పర్వాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులకు పరిమితమైంది. ఫిల్ సాల్ట్ (35 బంతుల్లో 59; 9 ఫోర్లు), మిషెల్ మార్ష్ (39 బంతుల్లో 63; ఒక ఫోర్, 6 సిక్సర్లు) సునామీ సృష్టించినా లాభం లేకపోయింది. వీరిద్దరి జోరుతో ఒక దశలో 11 ఓవర్లలో 112/1తో పటిష్ట స్థితిలో నిలిచిన ఢిల్లీని మన బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మయాంక్ మార్కండే 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, అకీల్ హుసేన్, నటరాజన్, అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవా ర్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న డబుల్ హెడర్‌లో చెన్నైతో పంజాబ్, ముంబైతో రాజస్థాన్ తలపడనున్నాయి.
హైదరాబాద్: 197/6 (అభిషేక్ 67, క్లాసెన్ 53; మార్ష్ 4/27), ఢిల్లీ: 188/6 (మార్ష్ 63, సాల్ట్ 59; మార్కండే 2/20).