IPL 2023 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) వరుస ఓటములకు గుడ్ బై చెప్పింది. సొంత గ్రౌండ్లో ఢిల్లీని 23 పరుగులతో చిత్తు చేసింది. ఆర్సీబీ పేసర్లు చెలరేగడంతో ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా ముగ్గురు డకౌట్ కావడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. మనీష్ పాండే(50) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అమన్ ఖాన్(18) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ఆర్సీబీ పేసర్ విజయ్‌కుమార్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ ఐదో ఓటమిని మూటగట్టుకుంది.
సొంత మైదానంలో డూప్లెసిస్ సేన రెచ్చిపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో విజయం నమోదు చేసింది. విరాట్ కోహ్లీ అర్ధ శతకం బాదడంతో 174 రన్స్ చేసింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీని 151 రన్స్‌కే పరిమితం చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మనీష్ పాండే(50) ఒక్కడే రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్, పార్నెల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
Consecutive half-centuries in Bengaluru 🙌@imVkohli provided a solid start for @RCBTweets and hit a fine fifty 👌👌
Relive his knock here 🔽 #TATAIPL | #RCBvDChttps://t.co/eqM6GGESi1
— IndianPremierLeague (@IPL) April 15, 2023
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి రెండో ఓవర్లోనే పెద్ద షాక్ తగిలింది. ప్రధాన బ్యాటర్లు ముగ్గురికి ముగ్గురు డకౌటయ్యారు. పృథ్వీ షా(0), మిచెల్ మార్ష్(0) యశ్ ధూల్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(19)ను విజయ్‌కుమార్ ఔట్ చేశాడు. దాంతో, 30 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డాయి. మనీశ్ పాండే(50) ఒంటరి పోరాటం చేశాడు, అభిషేక్ పొరెల్(5), అక్షర్ పటేల్(21)తో కలిసి 40 రన్స్ జోడించాడు.
LBW!@Wanindu49 has the last laugh 🙌
Manish Pandey’s gritty knock comes to an end 👏👏
Follow the match ▶️ https://t.co/xb3InbFbrg#TATAIPL | #RCBvDC pic.twitter.com/G2UpHwiPpK
— IndianPremierLeague (@IPL) April 15, 2023
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. డూప్లెసిస్(22) ,మ్యాక్స్‌వెల్(24) కాసేపు అలరించిన తక్కువకే ఔటయ్యారు. 30 బంతుల్లోనే కోహ్లీ యాభై రన్స్ కొట్టాడు. ఐపీఎల్లో 47వ ఫిఫ్టీ నమోదు చేసిన అతడిని లలిత్ యాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది. హర్షల్ పటేల్(6) మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తిక్(0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఆఖర్లో అనుజ్ రావత్(15), షహబాజ్ అహ్మద్(20) ధాటిగా ఆడడంతో ఆర్సీబీ ఆ మాత్రం రన్స్ చేయగలిగింది. రావత్, షహబాజ్ ఏడో వికెట్‌కు 42 రన్స్ జోడించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.