IPL 2023 | రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లకు 154 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలో దిగిన కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ 10 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు.
11వ ఓవర్లో జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా లక్నో వికెట్లు కోల్పోయింది. కైల్ మేయర్స్ అర్థ శతకంతో రాణించడంతో 154 పరుగులు చేయగలిగింది. స్టాయినిస్ 21 పరుగులు, నికోలస్ పూరన్ 28 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు, ట్రెంట్, సందీప్ శర్మ, హోల్డర్ ఒక్కో వికెట్ తీశారు.