IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సొంత గడ్డపై రెండో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్((Sunrisers Hyderabad)పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మర్క్రం సేన 121 రన్స్ చేసింది. కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్యా(34) విలువైన ఇన్నింగ్స్ ఆడాడరు. విజయానికి రెండు పరుగులు కావాల్సిన దశలో నికోలస్ పూరన్(11) సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. మార్కస్ స్టోయినిస్(10) అజేయంగా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీశాడు. ఫజల్హక్ ఫారుఖీ, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
లక్నో సూపర్ జెయింట్స్ సొంత గడ్డపై రెండో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మర్క్రం సేన 121 రన్స్ చేసింది. కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్యా(34) విలువైన ఇన్నింగ్స్ ఆడాడరు. విజయానికి రెండు పరుగులు కావాల్సిన దశలో నికోలస్ పూరన్(11) సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. మార్కస్ స్టోయినిస్(10) అజేయంగా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీశాడు. ఫజల్హక్ ఫారుఖీ, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
A steady 50-run partnership comes up between @klrahul & @krunalpandya24 🤝🤝
Live - https://t.co/3AtXI7lgak #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/SSRuin1fsg
— IndianPremierLeague (@IPL) April 7, 2023
ఆదిల్ రషీద్ దెబ్బకు లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. ఒకే ఓవర్లో అతను కేఎల్ రాహుల్(35),రొమరియో షెఫర్డ్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు.
114 వద్ద లక్నో నాలుగో వికెట్ పడింది. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(35) ఎల్బీగా ఔటయ్యాడు. అప్పటికి లక్నో విజయానికి 8 పరుగులు కావాలి.
ధాటిగా ఆడుతున్న కృనాల్ పాండ్యా(34) ఔటయ్యాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్(35) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు లక్నో స్కోర్..109/3. లక్నో విజయానికి 42 బంతుల్లో 13 పరుగులు కావాలి.
కృనాల్ పాండ్యా(28) ధాటిగా ఆడుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు. దాంతో, 9 రన్స్ వచ్చాయి. కేఎల్ రాహుల్(31) క్రీజులో ఉన్నాడు. వీళ్లు మూడో వికెట్‌కు 46 రన్స్ బాదారు. 11 ఓవర్లకు లక్నో స్కోర్.. 91/2. లక్నో విజయానికి 54 బంతుల్లో31 పరుగులు కావాలి.
ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా(15) సిక్స్ బాదాడు. దాంతో, 9 ఓవర్లకు లక్నో రెండు వికెట్ల నష్టానికి 72 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్(30) క్రీజులో ఉన్నారు. లక్నో విజయానికి 66 బంతుల్లో 50 పరుగులు కావాలి.
భువనేశ్వర్ కుమార్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో దీపక్ హుడా (7) ఔటయ్యాడు. తొలి బంతికి హుడా లాంగాఫ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. అయితే.. ఆఖరి బంతిని డిఫెండ్ చేయబోయాడు. గాల్లోకి లేచిన బంతిని భువి ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో పట్టుకున్నాడు.. కేఎల్ రాహుల్(18) క్రీజులో ఉన్నాడు. పవర్ ప్లేలో లక్నో స్కోర్.. 45/2. లక్నో విజయానికి 77 పరుగులు కావాలి.
Watch the dismissal here 👇👇#TATAIPL #LSGvSRH https://t.co/bJxQdpV73x pic.twitter.com/RwDBVnrlmv
— IndianPremierLeague (@IPL) April 7, 2023
విండీస్ విధ్వంసక ప్లేయర్ కైల్ మేయర్స్ టీ20ల్లో మరో మైలురాయికి చేరువయ్యాడు. 2వేల పరుగులు సాధించాడు. ఐపీఎల్ 16వ సీజన్లో అదగొడుతున్న అతను లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఫజల్హక్ ఫారుఖీ బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ కైల్ మేయర్స్(13)ను ఔట్ చేశాడు. మేయర్స్ గాల్లోకి లేపిన బంతిని డీప్ లెగ్ స్క్వేర్‌లో మయాంక్ క్యాచ్ పట్టాడు. దాంతో, 35 రన్స్ వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్(17), దీపక్ హుడా క్రీజులో ఉన్నారు.
Fazalhaq Farooqi gets the breakthrough as Kyle Mayers is caught in the deep by Mayank Agarwal.
Live - https://t.co/7Mh0bHCrTi #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/mLHyVLfbND
— IndianPremierLeague (@IPL) April 7, 2023
ఫజల్హక్ ఫారుఖీ వేసిన మూడో ఓవర్లో కైల్ మేయర్స్(12) బౌండరీ కొట్టాడు. కేఎల్ రాహుల్(12) క్రీజులో ఉన్నాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్.. 29/0. లక్నో విజయానికి 93 పరుగులు కావాలి.
భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లో కేఎల్ రాహుల్(5) బౌండరీ కొట్టాడు. బైస్ రూపంలో మరో బౌండరీ వచ్చింది. దాంతో, 13 రన్స్ వచ్చాయి. కేల్ మేయర్స్(3) క్రీజులో ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి (35), అబ్దుల్ సమద్(21), వాషింగ్టన్ సుందర్(16) మాత్రమే రాణించారు. ఉనాద్కాట్ వేసిన ఆఖరి ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. మొదటి బంతికి రెండో పరుగుల కోసం ప్రయత్నించి ఉమ్రాన్ మాలిక్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బంతిని సమద్ లాంగాఫ్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. ఐదో బంతిని మిడ్ వికెట్ దిశగా సిక్సర్‌గా మలిచాడు. దాంతో, హైదరాబాద్ 120 ప్లస్ స్కోర్ చేయగలిగింది.
ICYMI - A brilliant diving catch by @MishiAmit ends Rahul Tripathi's stay out there in the middle.#TATAIPL #LSGvSRH pic.twitter.com/uJkjykYlJt
— IndianPremierLeague (@IPL) April 7, 2023
అమిత్ మిశ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 18వ ఓవర్లో అతను వాషింగ్టన్ సుందర్(14), ఆదిల్ రషీద్‌ను ఔట్ చేశాడు. మూడో బంతికి సుందర్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గర హుడా క్యాచ్ పట్టాడు.రషీద్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా హుడా అందుకున్నాడు. దాంతో, ఏడో వికెట్ పడింది.
హైదరాబాద్ బిగ్ వికెట్ పడింది. ధాటిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి (33) ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో స్లిప్‌లో అమిత్ మిశ్రా క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. దాంతో, 39 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వాషింగ్టన్ సుందర్(14), అబ్దుల్ సమద్ క్రీజులో ఉన్నారు.
17 ఓవర్లకు హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి)(33), వాషింగ్టన్ సుందర్(14) క్రీజులో ఉన్నారు. వీళ్లు ఐదో వికెట్‌కు 38 రన్స్ జోడించారు.
దీపక్ హుడా బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి(17), బౌండరీ కొట్టాడు. హైదరాబాద్ 10 ఓవర్లకు 63 రన్స్ చేసింది. వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నాడు.
హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన హ్యారీ బ్రూక్(3) స్టంపౌట్ అయ్యాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ఫ్రంట్ ఫుట్ వచ్చాడు. బంతిని అందుకున్న నికోలస్ పూరన్ వెంటనే వికెట్లను గిరాటేశాడు. దాంతో, హైదరాబాద్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్ త్రిపాఠి(12) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్.. 55/4.
కృనాల్ పాండ్యా ఓపెనర్ అన్మోల్ ప్రీత్ సింగ్(31), ను ఎల్బీగా ఔట్ చేశాడు. అయితే.. అన్మోల్ రివ్యూ బతికి తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత బంతికి ప్టెన్ ఎయిడెన్ మర్క్రంను బౌల్డ్ చేశాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. రాహుల్ త్రిపాఠి(10), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్.. 50/3.
Krunal Pandya strikes and picks up the first wicket of the game.
Mayank Agarwal departs for 8 runs.
Live - https://t.co/7Mh0bHCrTi #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/DFdu0zJhoF
— IndianPremierLeague (@IPL) April 7, 2023
ఓపెనర్ అన్మోల్ ప్రీత్ సింగ్(27) రివ్యూతో బతికి పోయాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా ఔట్ ఇవ్వడంతో అన్మోల్ రివ్యూ తీసుకున్నాడు. కానీ, రివ్యూలో బంతి వికెట్ల మీదుగా వెళ్లింది. ఐదో బంతికి అన్మోల్ బౌండరీలు కొట్టాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి. 6 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్... 43/1.. రాహుల్ త్రిపాఠి(7) క్రీజులో ఉన్నాడు.
ఐదో ఓవర్లో అన్మోల్ ప్రీత్ సింగ్(22) రెండు బౌండరీలు కొట్టాడు. దాంతో, 9 రన్స్ వచ్చాయి. ఐదు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్... 33/1.. రాహుల్ త్రిపాఠి(2) క్రీజులో ఉన్నాడు.
కృనాల్ పాండ్యా తొలి వికెట్ తీశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(8)ను ఔట్ చేశాడు. రెండో ఓవర్ ఐదో బంతికి కవర్స్‌లో స్టొయినిస్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ వెనుదిరిగాడు. దాంతో, 21 రన్స్ వద్ద హైదరాబాద్ తొలి వికెట్ పడింది. రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు.
జయదేవ్ ఉనాద్కాట్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి అన్మోల్ ప్రీత్ సింగ్(12) సిక్స్ కొట్టాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి. మయాంక్ అగర్వాల్(3) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్..15/0 ..
కైల్ మేయర్స్ వేసిన తొలి ఓవర్లో 5 రన్స్ వచ్చాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(2), అన్మోల్ ప్రీత్ సింగ్(3) క్రీజులో ఉన్నారు.
మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇరు జట్లు సబ్స్టిట్యూట్స్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి.
ఎస్ఆర్హెచ్ సబ్స్టిట్యూట్స్ : హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ దగర్, మార్కో జాన్సేన్, మయాంక్ మార్కండే, ఫజల్హక్ ఫారుఖీ
లక్నో సబ్స్టిట్యూట్స్ : అయుశ్ బదొని, స్వప్నిల్ సింగ్, డానియెల్ సామ్స్, ప్రేరక్ మన్కడ్, అవేశ్ ఖాన్
A look at the Playing XI for #LSGvSRH
Live - https://t.co/3AtXI7lgak #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/ANfF4nWARa
— IndianPremierLeague (@IPL) April 7, 2023
లక్నో సూపర్ జెయింట్స్ ఇద్దరు స్టార్ పేసర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా మార్క్ వుడ్, అవేశ్ ఖాన్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. దాంతో వీళ్ల ప్లేస్‌లో జయదేవ్ ఉనాద్కాట్, రొమారియో షెపర్డ్ తుది జట్టులోకి వచ్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మర్క్రం టాస్ గెలిచాడు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తొలి జట్టు ఎస్ఆర్హెచ్ కావడం విశేషం.
Hello from Lucknow 🏟️👋@LucknowIPL face @SunRisers in Match 🔟 of the #TATAIPL 2023 👊🏻
Who are you rooting for 🤔 #LSGvSRH pic.twitter.com/lZf41CdIIt
— IndianPremierLeague (@IPL) April 7, 2023