IPL 2023 : ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ చెలరేగింది. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌పై అనూహ్యంగా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండోసారి ముంబైపై పై చేయి సాధించింది. ఇషాన్ కిషన్(59) హాఫ్ సెంచరీతో మెరుపులు, టిమ్ డేవిడ్(32 నాటౌట్) ధనాధన్ ఆడడంతో రోహిత్ సేన అవలీలగా గెలుస్తుందనిపించింది. కానీ, లక్నో బౌలర్లు విజృంభించి ముంబైని 172 కట్టడి చేశారు. ఏడో విజయంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది.
మొహ్సిన్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో తొలి మూడు బంతులకు రెండు రన్స్ వచ్చాయి. నాలుగో బంతికి యార్కర్. ఐదో బంతికి ఒక రన్, ఆరో బంతికి రెండు పరుగులు వచ్చాయంతే. కామెరూన్ గ్రీన్(4), టిమ్ డేవిడ్(32) నాటౌట్‌గా నిలిచారు. దాంతో, 5 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది.
ముంబై నాలుగో వికెట్ పడింది. మొహ్సిన్ ఖాన్ ఓవర్లో నేహల్ వధేర(16) ఔటయ్యాడు. బౌండరీ వద్ద గౌతమ్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. విష్ణు వినోద్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. టిమ్ డేవిడ్(7) ఆడుతున్నాడు. 16.2 ఓవర్లకు స్కోర్.. 131/4
యశ్ ఠాకూర్ బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ సూర్యకుమార్ యాదవ్(7)ను బౌల్డ్ చేశాడు.స్కూప్ షాట్ ఆడబోయిన సూర్య బంతిని మిస్ అయ్యాడు. టిమ్ డేవిడ్ వచ్చాడు. నేహల్ వధేర(8) ఆడుతున్నాడు.
As TIMELY as a wicket can get!
Impact Player Yash Thakur gets Suryakumar Yadav out 🤯
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/IUTJtKKPrS
— IndianPremierLeague (@IPL) May 16, 2023
ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(59) ఔటయ్యాడు. ఫిఫ్టీ బాదిన అతను రవి బిష్ణోయ్ ఓవర్లో నవీన్ ఉల్ హక్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 103 వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. నేహల్ వధేర వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్(3) ఆడుతున్నాడు.
5️⃣0️⃣ for @ishankishan51 but @bishnoi0056 gets him to pick his second wicket!#MI 104/2 after 11.2 overs
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/Fh4Zw10HHL
— IndianPremierLeague (@IPL) May 16, 2023
ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(53) ఫిఫ్టీ బాదాడు. కృనాల్ పాండ్యా ఓవర్లో ఫోర్ కొట్టి అతను హాఫ్ సెంచరీ సాధించాడు.
ముంబై తొలి వికెట్ పడింది రవి బిష్ణోయ్ ఓవర్లో రోహిత్ శర్మ(37) ఔటయ్యాడు. బిష్ణోయ్‌కు ఇది 50 ఐపీఎల్ వికెట్. దాంతో, 90 రన్స్ వద్ద ముంబై వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్(49) ఆడుతున్నాడు.
పవర్ ప్లేలో ముంబై ఓపెనర్లు జోరుగా ఆడారు. దాంతో, వికెట్ పడకుండా ముంబై 58 రన్స్ కొట్టింది. రోహిత్ శర్మ(29), ఇషాన్ కిషన్(26) ఆడుతున్నారు.
రోహిత్ శర్మ(11) దంచుడు మొదలెట్టాడు. యశ్ ఠాకూర్ ఓవర్లో తొలి బంతికే సిక్స్ బాదాడు. ఇషాన్ కిషన్(25) ఆడుతున్నాడు. 4 ఓవర్లకు స్కోర్.. 38/0
A powerful start from the @mipaltan in the chase 🔥🔥
They move to 34/0 after 3.4 overs 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/aeZxCP2w6X
— IndianPremierLeague (@IPL) May 16, 2023
ఇషాన్ కిషన్(17) దంచుతున్నాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో రెండో బాల్‌ను స్టాండ్స్‌లోకి పంపాడు. ఆఖరి బాల్‌కు ఫోర్ కొట్టాడు. 13 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ(2) ఆడుతున్నాడు. రెండు ఓవర్లకు స్కోర్.. 20/0
కృనాల్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో రెండో బాల్‌కు ఇషాన్ కిషన్(6) ఫోర్ బాదాడు. రోహిత్ శర్మ(1) ఆడుతున్నాడు.
అకాశ్ మధ్వాల్ వేసిన 20వ ఓవర్లో నాలుగో బాల్‌కు నికోలస్ పూరన్(8) ఫోర్ బాదాడు. ఆఖరి బాల్‌కు స్టోయినిస్(89) సిక్స్ కొట్టాడు. దాంతో, దాంతో లక్నో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీ తర్వాత స్టోయినిస్(82) వీర బాదుడు బాదుతున్నాడు. బెహ్రన్‌డార్ఫ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో, లక్నో స్కోర్ 150 దాటింది. నికోలస్ పూరన్(3)ఆడుతున్నాడు. 19 ఓవర్లకు స్కోర్.. 162/3.
కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న స్టోయినిస్(51)హాఫ్ సెంచరీ బాదాడు. క్రిస్ జోర్డాన్ ఓవర్లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ సాధించాడు. 36 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో అతను అర్ధ శతకం కొట్టాడు.
కెప్టెన్ కృనాల్ పాండ్యా(48) రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న అతను పరుగెత్తలేకపోయాడు. దాంతో, మైదానం వీడాడు. అతని ప్లేస్‌లో నికోలస్ పూరన్ వచ్చాడు.
కెప్టెన్ కృనాల్ పాండ్యా(48) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. స్టోయినిస్(34) తో కలిసి నాలుగో వికెట్‌కు 73 రన్స్ జోడించాడు. 15 ఓవర్లకు స్కోర్.. 108/3
కెప్టెన్ కృనాల్ పాండ్యా(36) వేగం పెంచాడు. చావ్లా బౌలింగ్‌లో లాంగాన్‌లో భారీ సిక్స్ బాదాడు. స్టోయినిస్(19) నిలకడగా ఆడుతున్నాడు. 11 ఓవర్లకు స్కోర్.. 78/3.
స్టోయినిస్(18), కృనాల్ పాండ్యా(27) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 68/3.
స్టోయినిస్(17) దంచుతున్నాడు. చావ్లా ఓవర్లో డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా సిక్స్ బాదాడు. 13 రన్స్ వచ్చాయి. కృనాల్ పాండ్యా(23) ఆడుతున్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 63/3.
స్టోయినిస్(10) దంచుతున్నాడు. హృతిక్ షోకీన్ ఓవర్లో సిక్స్ బాదాడు. కృనాల్ పాండ్యా(17) ఆఖరి బాల్‌కు సింగిల్ తీశాడు. దాంతో, లక్నో స్కోర్ 50కి చేరింది. 8 ఓవర్లకు స్కోర్.. 50/3.
లక్నో కష్టాల్లో పడింది. పీయూష్ చావ్లా ఓవర్లో తొలి బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్(16) ఔటయ్యాడు. కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టడంతో లక్నో మూడో వికెట్ పడింది. స్టోయినిస్ వచ్చాడు.
పవర్ ప్లేలో ముంబై బౌలర్ల ధాటికి లక్నో 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(16), కృనాల్ పాండ్యా(13) ఆడుతున్నారు.
క్వింటన్ డికాక్(15) స్పీడ్ పెంచాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో ఒంటిచేత్తో సిక్స్ కొట్టాడు. కృనాల్ పాండ్యా(11) ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 32/2.
కృనాల్ పాండ్యా(10) తొలి బౌండరీ బాదాడు. హృతిక్ షోకీన్ ఓవర్లో ఫోర్ కొట్టాడు. క్వింటన్ డికాక్(7) ఆడుతున్నాడు. 4 ఓవర్లకు స్కోర్.. 23/2
బెహ్రన్‌డార్ఫ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి తడబడుతున్న లక్నో ఓపెనర్ దీపక్ హుడా (5)ను ఔట్ చేశాడు. హుడా గాల్లోకి లేపిన బంతిని టిమ్ డేవిడ్ ఈసారి క్యాచ్ పట్టాడు. దాంతో, 12 రన్స్ వద్ద లక్నో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత బాల్‌కు ప్రేరక్ మన్కడ్(0)ను డకౌట్ చేశాడు. మన్కడ్ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ అందుకున్నాడు.
Double success for Jason Behrendorff and @mipaltan 😎#LSG lose Deepak Hooda & Prerak Mankad inside the powerplay.
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/T5vuzYpolA
— IndianPremierLeague (@IPL) May 16, 2023
లక్నో ఓపెనర్ దీపక్ హుడా (5)కు లైఫ్ దొరికింది. క్రిస్ జోర్డాన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి హుడా భారీ షాట్ ఆడాడు. టిమ్ డేవిడ్ పరుగెత్తూ వెళ్లినా క్యాచ్ పట్టలేకపోయాడు. ఆఖరి బంతికి క్వింటన్ డికాక్(7) సిక్స్ బాదాడు. దాంతో, 9 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లకు స్కోర్.. 12/0
బెహ్రన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. లక్నో ఓపెనర్లు క్వింటన్ డికాక్(1), దీపక్ హుడా (2)ఆడుతున్నారు.
లక్నో : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), స్టోయినిస్, నికోలస్ పూరన్, అయుష్ బదొని, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్.
ముంబై : రోహిత్ శర్మ(కెప్టెన్ ), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేర, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, బెహ్రన్‌డార్ఫ్, అకాశ్ మధ్వాల్.
సబ్స్టిట్యూట్స్
లక్నో - మేయర్స్, యశ్ ఠాకూర్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్.
ముంబై - రమన్‌దీప్ సింగ్, విష్ణు వినోద్, స్టబ్స్, కార్తికేయ, రాఘవ్ గోయల్.
The Playing XIs are IN ‼️
What do you make of the two sides?
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/9P4rCMqg5B
— IndianPremierLeague (@IPL) May 16, 2023
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. పిచ్ చేజింగ్‌కు అనుకూలంగా ఉందని మొదట బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.