భూత్పూర్ : మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన గ్రామంలో దారుణం జరిగింది. ఇటీవల వేముల గ్రామంలో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. నిందితుడు కొన్ని నెలలుగా మానసిక వికలాంగురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కోతి కరవడంతో చికిత్స నిమిత్తం బాధితురాలు హాస్పిటల్కు వెళ్లింది. అనుమానంతో వైద్యులు పరీక్షలు చేయగా ఆమె ఐదు నెలల గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. దీనిపై కుటుంబసభ్యులు బాధితురాలిని ప్రశ్నించగా గ్రామానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు చెప్పింది.
అయితే పరమేశ్తోపాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే ప్రెగ్నెన్సీ తీయించడానికి నిందితులకు, బాధిత కుటుంబానికి మధ్య రూ.9 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.