IPL-2023 Live Updates | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగనున్నాయి. ముంబయి ఇండియన్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 69వ లీగ్ మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్నది. ముంబయికి ఇదే చివరి నాకౌట్ మ్యాచ్. ఈ మ్యాచ్ ముంబయి ఇండియన్స్‌కు కీలకంగా మారనున్నది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ముంబయి జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనున్నది. అదే సమయంలో గెలుపొందిన ప్లే ఆఫ్ బెర్తు ఖరారైనట్లు కాదు. ఆర్సీబీ Vs గుజరాత్ మ్యాచ్‌పై ముంబయి ప్లే ఆఫ్ బెర్తు ఆధారపడి ఉన్నది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నించి నిష్క్రమించింది. అయితే విజయంతో టోర్నీకి వీడ్కోలు పలకాలని భావిస్తున్నది.