గువాహటి: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అసోం రాష్ట్రం గువాహటిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రెండింట్లో ఓటమి మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఖాతా తెరువాలని చూస్తున్నది. అటు తొలి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నది.
రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు జోస్ బట్లర్(79), యశస్వీ జైస్వాల్(60), అర్ధ శతకాలు బాదడంతో సంజూ సేన భారీ స్కోర్ చేసింది. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ బౌలింగ్‌తో ఢిల్లీని వణికించాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ఒం (65) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఓ ఆ తర్వాత ఢిల్లీని 142 పరుగులకే కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లు తీశారు. అశ్విన్ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
ఒంటరి పోరాటం చేస్తున్న డేవిడ్ వార్నర్(65) ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, 139 రన్స్ వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో వికెట్ పడింది. చాహల్ బౌలింగ్‌లో కీపర్ అభిషేక్ పొరెల్(7) క్యాచ్ ఔటయ్యాడు.
అశ్విన్ బిగ్ వికెట్ తీశాడు. విధ్వంసక బ్యాటర్ రోవ్‌మన్ పావెల్(2)ను ఔట్ చేశాడు. పావెల్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద హెట్మెయిర్ క్యాచ్ పట్టాడు. దాంతో,118 వద్ద ఢిల్లీ ఆరో వికెట్ పడింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(54) హాఫ్ సెంచరీ కొట్టాడు. అశ్విన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి ఫిఫ్టీకి చేరువయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో వికెట్ పడింది. అక్షర్ పటేల్(2) ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ వచ్చిన అతడిని సంజూ శాంసన్ స్టంపౌట్ చేశాడు. డేవిడ్ వార్నర్(49), రోవ్‌మన్ పావెల్(2) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్... 113/5
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 40 రన్స్ కొట్టిన అతను ఈ మైలురాయికి చేరువయ్యాడు. వార్నర్ గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉన్నాడు.
Milestone unlocked @davidwarner31 completes runs in the IPL #TATAIPL | #RRvDC pic.twitter.com/7PkLNTVpcY
— IndianPremierLeague (@IPL) April 8, 2023
ట్రెంట్ బౌల్ట్ మూడో వికెట్ తీశాడు. ధాటిగా ఆడుతున్న లలిత్ యాదవ్(38)ను బౌల్డ్ చేశాడు. లాంగాఫ్‌లో బౌండరీ కొట్టిన లలిత్ ఆ తర్వాత బంతికి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. డేవిడ్ వార్నర్(40) క్రీజులో ఉన్నాడు.
హోల్డర్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్(33) బౌండరీ కొట్టాడు. డేవిడ్ వార్నర్(40) క్రీజులో ఉన్నాడు. 10 రన్స్ వచ్చాయి. వీళ్లు నాలుగో వికెట్‌కు 57 రన్స్ జోడించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 12 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది.
చాహల్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్(25) స్వీప్ షాట్‌తో రెండు బౌండరీలు కొట్టాడు. డేవిడ్ వార్నర్(38) కొట్టిన ఆఖరి బంతిని బౌండరీ వద్ద హెట్మెయిర్ డైవ్ చేస్తూ ఆపాడు. 15 రన్స్ వచ్చాయి. వీళ్లు నాలుగో వికెట్‌కు 47 రన్స్ జోడించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది.
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(30), లలిత్ యాదవ్(14) చెరొక బౌండరీ కొట్టారు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. వీళ్లు నాలుగో వికెట్‌కు 25 రన్స్ జోడించారు.
రాజస్థాన్ రాయల్స్ 7వ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకుంది. జోస్ బట్లర్ ప్లేస్‌లో స్పిన్నర్ మురుగన్ అశ్విన్ మైదానంలోకి వచ్చాడు.
పవర్ ప్లేలో ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి క్యాపిటల్స్ 38 రన్స్ వేసింది. డేవిడ్ వార్నర్(19), లలిత్ యాదవ్(2) క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ మరింత కష్టాల్లో పడింది. రిలీ రస్సో(14) స్వీప్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో అతను మిడాన్‌లో యశస్వీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 36 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
Third wicket inside the powerplay for @rajasthanroyals 👌👌@ashwinravi99 gets Rilee Rossouw as @ybj_19 takes the catch 🙌🏻
Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/miPnQiGG4D
— IndianPremierLeague (@IPL) April 8, 2023
డేవిడ్ వార్నర్(18) జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో రెండో బంతికి లాంగాన్‌లో ఫోర్ బాదాడు. ఆఖరి బంతిని బౌండరీకి తరలించాడు. దాంతో, 11 రన్స్ వచ్చాయి. రిలీ రస్సో(12) క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్.. 32/2.
అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో 7 రన్స్ వచ్చాయి. నాలుగో బంతికి డేవిడ్ వార్నర్(13) ఫోర్ బాదాడు. రిలీ రస్సో(7) క్రీజులో ఉన్నాడు. 4 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్.. 21/2.
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మొదటి బంతికి రిలీ రస్సో(5) బౌండరీ కొట్టాడు. మూడో బంతికి డేవిడ్ వార్నర్(8) ఫోర్ బాదాడు. దాంతో, రన్స్ వచ్చాయి. 3 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్.. 14/2.
సందీప్ శర్మ బౌలింగ్‌లో ఐదో బంతికి డేవిడ్ వార్నర్(5) బౌండరీ కిట్టాడు. రిలీ రస్సో క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 5 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద షాక్. ఖాతా తెరవక ముందే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే పృథ్వీ షా(0) ఔటయ్యాడు. శాంసన్ సూపర్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. మూడో బంతికి మనీశ్ పాండే ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా కూడా ఫలితం లేకపోయింది. , డేవిడ్ వార్నర్, రిలీ రస్సో క్రీజులో ఉన్నారు.
How about THAT for a start! 🤯
WHAT. A. CATCH from the #RR skipper ⚡️⚡️#DC lose Impact Player Prithvi Shaw and Manish Pandey in the first over!
Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/rpOzCFrWdQ
— IndianPremierLeague (@IPL) April 8, 2023
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్. ఖాతా తెరవక ముందే ఆ జట్టు తొలి వికెట్ పడింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే పృథ్వీ షా(0) ఔటయ్యాడు. శాంసన్ సూపర్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంది. బౌలింగ్ పూర్తి కావడంతో ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ ఓపెనర్‌గా వచ్చాడు.
ఐపీఎల్ 16వ సీజన్ 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చెలరేగారు. దాంతో, 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(60), జోస్ బట్లర్(79) అర్ధ శతకాలు బాదారు. ఆఖర్లో హెట్మెయిర్(39) సిక్స్‌లతో విరుచుకు పడ్డాడు. అన్రిచ్ నార్జ్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికి హెట్మెయిర్ మిడాఫ్‌లో సిక్స్ బాదాడు. మూడో బంతిని మిడాన్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 16 రన్స్ వచ్చాయి.
.@josbuttler displayed his opening brilliance by scoring 79 off 51 deliveries and he becomes our 🔝 performer of the first innings of the #RRvDC clash in the #TATAIPL.
A look at his batting summary 🔽 pic.twitter.com/dpQZzcvwIe
— IndianPremierLeague (@IPL) April 8, 2023
ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో జోస్ బట్లర్(79) ఔటయ్యాడు. అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హెట్మెయిర్(23) క్రీజులో ఉన్నాడు. దాంతో, 175 రన్స్ వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ పడింది.
హెట్మెయిర్(15) ధాటిగా ఆడుతున్నాడు. పావెల్ వేసిన 17వ ఓవర్లో వరుసగా సిక్స్, బౌండరీ కొట్టాడు. దాంతో, 14 రన్స్ వచ్చాయి. జోస్ బట్లర్(69) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 157 రన్స్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్(68) జోరు పెంచాడు. ముఖేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. 16 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 143 రన్స్ చేసింది. హెట్మెయిర్(3) క్రీజులో ఉన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ పరుగుల వేగం తగ్గింది. 15 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. జోస్ బట్లర్(58), హెట్మెయిర్(1) క్రీజులో ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ పడింది. యంగ్‌స్టర్ రియాన్ పరాగ్(7)ను పావెల్ బౌల్డ్ చేశాడు. పరాగ్ ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయాడు. బంతి మిస్ అయ్యి వికెట్లను తాకింది. దాంతో, 126 రన్స్ వద్ద రాజస్థాన్ మూడో వికెట్ పడింది. హెట్మెయిర్ క్రీజులోకి వచ్చాడు.
జోస్ బట్లర్(53) హాఫ్ సెంచరీ కొట్టాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అతను ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ విధ్వంసక ఓపెనర్ 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 రన్స్ స్కోర్ చేశాడు. 13 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 122/2.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో 5 రన్స్ మాత్రమే వచ్చాఇయ. జోస్ బట్లర్(45), రియాన్ పరాగ్(4) క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 113/2.
దూకుడు మీదున్న రాజస్థాన్‌కు ఢిల్లీ కళ్లెం వేసింది. ఇప్పటికే ధాటిగా ఆడిన ఓపెనర్ జైస్వాల్‌ను ముకేశ్ కుమార్ పెవిలియన్‌కు పంపగా, ఇప్పుడు కుల్దీప్ యాదవ్ మరో ఓపెనర్ బట్లర్‌ను ఔట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు.
రాజస్థాన్ జట్టు 100 పరుగుల మైలురాయిని చేరింది. 11వ ఓవర్ తొలి బంతికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ రెండు పరుగులు చేయడం ద్వారా జట్టు స్కోరు సెంచరీ అయ్యింది.
తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ జట్టుకు ఢిల్లీ బౌలర్ ముఖేశ్ కుమార్ కళ్లెం వేశాడు. తొమ్మిదో ఓవర్ మూడో బంతికి మంచి ఊపు మీదున్న యశస్వి జైశ్వాల్‌ను ఔట్ చేశాడు. రిటర్న్ క్యాచ్‌తో జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి జైస్వాల్ స్కోరు 31 బంతుల్లో 60 పరుగులు. అందులో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
ఢిల్లీతో మ్యాచ్‌లో రాజస్థాన్ దూకుడు కొనసాగుతున్నది. ఓపెనర్లు బట్లర్, జైస్వాల్ దూకుడుకు ఢిల్లీ బౌలర్లు అడ్డుకట్ట వేయలేకుపోతున్నారు. దాంతో ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు వికెట్ నష్టపోకుండా 96 పరుగులకు చేరింది. జైస్వాల్ 59, బట్లర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రాజస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 25 బంతుల్లోనే 10 ఫోర్లతో 50 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ 16 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేశాడు.
ఢిల్లీ బౌలర్ ఎన్రిచ్ నోర్జే రాజస్థాన్ దూకుడు కాస్త తగ్గేలా చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ బాల్స్‌తో ఆరో ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు 68 పరుగులు.
రాజస్థాన్ ఓపెనర్ల వీరవిహారం కొనసాగుతున్నది. బట్లర్, జైస్వాల్ ఇద్దరూ బౌండరీల వర్షం కురిపిస్తుండటంతో రాజస్థాన్ స్కోరు ఐదు ఓవర్లకే 63 పరుగులకు చేరుకుంది.
రాజస్థాన్ బ్యాటర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్లు యశ్వస్వి జైస్వాల్, జోస్ బట్లర్ వీరవిహారం చేయడంతో జట్టు స్కోరు నాలుగు ఓవర్లకే 50 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ ఓవర్లో బౌలర్ ఖలీల్ అహ్మద్ మూడు వైడ్లు వేశాడు.
తొలి రెండు ఓవర్లలోనే 32 పరుగులు పిండుకున్న రాజస్థాన్ బ్యాటర్లను మూడో ఓవర్లో ఢిల్లీ బౌలర్ ముఖేశ్ కుమార్ కట్టడి చేశాడు. ఆరు బంతులు వేసి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే వీరవిహారం చేస్తున్నారు. తొలి ఓవర్లో ఐదు ఫోర్లు కొట్టి జైస్వాల్ 20 పరుగులు పిండుకోగా, రెండో ఓవర్లు మూడు ఫోర్లతో బట్లర్ 12 పరుగులు చేశాడు. దాంతో రెండు ఓవర్లకే రాజస్థాన్ స్కోరు 32 పరగులకు చేరింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఒకే ఓవర్లో ఐదు ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
ఢిల్లీ క్యాపిటల్స్: అమన్ ఖాన్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ దూబే
రాజస్థాన్ రాయల్స్: నవదీప్ సైనీ, ఆకాశ్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కేఎం ఆసిఫ్, డొనోవాన్ ఫెరీరా
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలే రస్సో, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ఎన్రిచ్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్-వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.
గువాహటి: రాజస్థాన్ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సీజన్లో రెండు జట్లు ఇప్పటికే రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోగా, రాజస్థాన్ ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది.