ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ పండుగ ఐపీఎల్ మరోసారి అభిమానులను అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈసారి ఐపీఎల్లో పది జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెలలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనుంది.
దీనిలో స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు. ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలు కొంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. కొత్త ఫ్రాంచైజీ జట్లు కూడా ప్లేయర్ పూల్ నుంచి తమకు నచ్చిన ఆటగాళ్లను ఎంచుకున్నాయి. ఇక మిగతా ఆటగాళ్ల కోసం వేలంలో పోటీ పడాల్సిందే.
ఈ క్రమంలో ‘మార్కీ లిస్టు’ను ఐపీఎల్ విడుదల చేసింది. మొత్తం పది మంది ఆటగాళ్లతో ఈ జాబితా విడుదలైంది. ఈ పదిమంది కూడా తమ బేస్ ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. వీరిలో భారత స్టార్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు విదేశీ ఆటగాళ్లయిన ఫాఫ్ డు ప్లెసిస్, క్వింటన్ డీకాక్, కగిసో రబాడ, డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు.
𝘽𝙞𝙜 𝙉𝙖𝙢𝙚𝙨 𝙖𝙩 𝙩𝙝𝙚 𝙈𝙚𝙜𝙖 𝘼𝙪𝙘𝙩𝙞𝙤𝙣 💪🏻
— IndianPremierLeague (@IPL) February 1, 2022
A bidding war on the cards 👍🏻 👍🏻
Here are the 1⃣0⃣ Marquee Players at the 2⃣0⃣2⃣2⃣ #IPLAuction 🔽 pic.twitter.com/lOF1hBCp8o