ఈ ఐపీఎల్లో కొత్తగా చేరుతున్న రెండు జట్లలో లక్నో సూపర్ జయింట్స్ ఒకటి. ఈ జట్టుకు మెంటార్‌గా భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఏకంగా రూ.17 కోట్లు పెట్టి స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఈ జట్టు సొంతం చేసుకుంది.
అతనికే జట్టు సారధ్య బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించింది. వచ్చే నెలలోనే ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో తాజాగా లక్నో జట్టు.. తమ లోగోను ఆవిష్కరించింది.
‘అత్యున్నత శిఖరాలకు ఎగరడం కోసం.. లక్నో సూపర్ జయింట్స్ రెక్కలు విప్పేందుకు సిద్ధం. అద్భుతం కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. లోగో అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ కలిసి 7,090 కోట్ల రూపాయలతో లక్నో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Soaring towards greatness. 💪🏼
— Lucknow Super Giants (@LucknowIPL) January 31, 2022
Lucknow Super Giants is all set to stretch its wings. 🔥
Prepare for greatness! 👊🏼#LucknowSuperGiants #IPL pic.twitter.com/kqmkyZX6Yi