ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్వల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో శుభ్‌మన్ గిల్(11) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. యువ పేసర్ చేతన్ సకారియా వేసిన 9వ ఓవర్ మొదటి బంతికే నితీశ్ రాణా(22) వెనుదిరిగాడు. రాజస్థాన్ బౌలర్లు ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పవర్‌ప్లే ఆఖరికి 25/1తో కష్టాల్లో పడింది. 9 ఓవర్లకు కోల్‌కతా 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠి(11), సునీల్ నరైన్(5) క్రీజులో ఉన్నారు.
OUT
— IndianPremierLeague (@IPL) April 24, 2021
Gill 11 (19) survived once when he was dropped by Jaiswal at sweeper cover but has to return now as an under-arm direct hit from Buttler finds him short of the crease.
Powerplay is over and #KKR are 25-1.
👉 https://t.co/oKLdD2Pi9R #VIVOIPL #RRvKKR pic.twitter.com/gDtr1FAKrL