అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్(69 నాటౌట్: 47 బంతుల్లో 6ఫోర్లు ,2 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ అలవోకగా గెలుపొందింది. పృథ్వీ షా(39), స్టీవ్ స్మిత్(24) రాణించారు.
అంతకుముందు మయాంక్ అగర్వాల్(99 నాటౌట్: 58 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ మలన్(26: 26 బంతుల్లో ఫోర్, సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అగర్వాల్ మూడు ఫోర్లు, సిక్స్ బాది 23 రన్స్ రాబట్టడంతో జట్టు స్కోరు 160 దాటింది.
Here's the Points Table after Match 29 of #VIVOIPL. @DelhiCapitals take the top spot, @PunjabKingsIPL are 6th. #PBKSvDC #VIVOIPL #IPL2021 pic.twitter.com/OhVMpze5VD
— IndianPremierLeague (@IPL) May 2, 2021