అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.
ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ అద్భుత ప్రదర్శన చేస్తూ విజయాలు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ ఏడు మ్యాచ్‌లాడి మూడింట్లో మాత్రమే గెలుపొందింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్ ఉత్సాహంలో ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ కూడా అదే జోరుమీదుంది.
Match 29. Delhi Capitals XI: P Shaw, S Dhawan, S Smith, R Pant, M Stoinis, S Hetmyer, A Patel, L Yadav, K Rabada, I Sharma, A Khan https://t.co/Rm0jfZtn6l #PBKSvDC #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) May 2, 2021
Match 29. Punjab Kings XI: M Agarwal, P Singh, C Gayle, D Malan, D Hooda, S Khan, H Brar, C Jordan, R Meredith, R Bishnoi, M Shami https://t.co/Rm0jfZtn6l #PBKSvDC #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) May 2, 2021