శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 16:11:04

కరోనా ఎఫెక్ట్‌..ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం!

కరోనా ఎఫెక్ట్‌..ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం!

మార్చి 12 నుంచి ధర్మశాల వేదికగా భారత్‌, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది.

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా టోక్యో 2020 ఒలింపిక్స్‌ వాయిదా పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటికే  జరగాల్సిన క్రీడా పోటీలు, ఒలింపిక్‌ సంబంధిత ఈవెంట్లు రద్దయ్యాయి.  భారత్‌ వేదికగా ఈ నెల 29న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌పై కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9వరకు  విశ్వక్రీడలు జరగాల్సి ఉంది.  ఆగ్నేయాసియా నుంచి ఆటగాళ్లు ఎవరూ  టోర్నీలో పాల్గొనకున్నా.. మ్యాచ్‌లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరవ్వడమే కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.  భారత్‌లో ఇప్పటికే 28  కరోనా కేసులు  నమోదైన నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. 

అయితే, ఈ నెల 12న ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌కు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు. అసలు ఆ అంశం గురించి సమావేశంలో చర్చించలేదని తెలిపాడు. ప్రస్తుతానికి వైరస్‌ వల్ల ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ కూడా వెల్లడించాడు. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 

క్రికెట్‌ మ్యాచ్‌లను చూసేందుకు వేలాది మంది స్టేడియాలకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  జనసమూహాలతో కూడిన ఈవెంట్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తుందో లేదో చూడాలి. మార్చి 12 నుంచి ధర్మశాల వేదికగా భారత్‌, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. బీసీసీఐ కరోనా వైరస్‌  కేసుల గురించి బీసీసీఐ  పర్యవేక్షిస్తోందని దాదా తెలిపాడు. షెడ్యూల్‌ ప్రకారమే సౌతాఫ్రికా భారత్‌లో పర్యటిస్తుందని, ఐపీఎల్‌ కూడా నిర్వహిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 


ఇవికూడా చదవండి


కరోనా కలవరం..మైండ్‌స్పేస్‌ ఉద్యోగులు ఇంటికి


కరోనా.. భారత్‌కు ఓ హెచ్చరిక!


కరోనా వైరస్.. లక్షణాలు..జాగ్రత్తలు


గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలుlogo