Paris Olympics | లుసానె: రష్యా, బెలారస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు గాను పై రెండు దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్లకు ‘తటస్థ హోదా’ను అందించింది. రష్యా నుంచి 14 మంది, బెలారస్ నుంచి 11 మంది అథ్లెట్లు తమ దేశాల జాతీయ జెండా, గీతం, రంగులు లేకుండా తటస్థ హోదాలో ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించింది.
సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ విభాగాల్లో బరిలోకి దిగబోయే ఆటగాళ్ల పేర్లను విడుదల చేసింది.. బృందాలుగా (టీమ్ ఈవెంట్స్) ఆడే క్రీడల నుంచి రష్యా, బెలారస్ ఆటగాళ్లపై నిషే ధం కొనసాగుతోంది. రెండేండ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా ఈ రెండు దేశాలపై ఐ వోసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే.