హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ పూల్ వేదికగా జరుగుతున్న ఎనిమిదవ జూనియర్, సబ్‌జూనియర్ అంతర్‌జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో యువ స్విమ్మర్ శ్రీనిత్య సాగి పసిడి పతక జోరు కనబరిచింది. ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ ఐదు స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన బాలికల 400మీ, 800మీ ఫ్రీ స్టయిల్‌తో పాటు 100మీ, 200మీ బ్యాక్ స్ట్రోక్, 400మీ వ్యక్తిగత మెడ్లె ఈవెంట్లలో నిత్య అగ్రస్థానంలో నిలిచి ఆకట్టుకుంది. మరోవైపు హేమ వర్షిణి మూడు వేర్వేరు విభాగాల్లో స్వర్ణాలు దక్కించుకోగా, జిగ్న చౌదరీ, అభయ్ ఆకట్టుకున్నారు.