Pratika Rawal : మహిళల వన్డే వరల్డ్ కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో గాయపడిన తనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో.. కీలకమైన ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందని ఆశించిన హర్మన్‌ప్రీత్ సేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
అసలేం జరిగిందంటే..? డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం వర్షం అంతరాయంతో 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కీలక వికెట్లు కోల్పోయింది. అయితే.. శోభన మోస్త్రే (26) కీలక ఇన్నింగ్స్ ఆడింది. రాధా యాదవ్ వేసిన 21వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శోభన.. చివరి బంతిని మిడాఫ్‌లో బలంగా కొట్టింది. బౌండరీ వెళ్లకుండా బంతిని ఆపబోయిన ప్రతీక.. కొంచెం ముందుకు వెళ్లింది. తిరిగి వెనక్కి వచ్చే క్రమంలో ఆమె షూ స్పైక్స్ గడ్డిలో ఇరుక్కోవడంతో.. కిందపడిపోయింది.
🚨Pratika Rawal has been ruled out of the ICC Women’s World Cup after suffering an injury in the last league game against Bangladesh #ICCWomensWorldCup2025 #IndianCricket pic.twitter.com/FTA6dchh47
— Cricbuzz (@cricbuzz) October 27, 2025
ఎడమ కాలిమడిమ మడతపడంతో నొప్పిని భరించలేకపోయింది ప్రతీక. నడవడానికి ఇబ్బంది పడిన ఆమెను సహచరులు డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అయితే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసినా బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో.. స్మృతిమంధానతో కలిసి అమన్‌జోత్ కౌర్ ఇన్నింగ్స్ ఆరంభించింది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ప్రతీక ఆరోగ్యం గురించి బీసీసీఐగానీ, కోచ్ మజుందార్గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో.. కీలకమైన సెమీస్ పోరులో ఆమె ఆడడంపై సోమవారం స్పష్టత వస్తుందని ఆశించారంతా. కానీ, భారత జట్టుకు, అభిమానులకు షాకిస్తూ..తను టోర్నీ నుంచి వైదొలిగింది. నిరుడు డిసెంబర్లో వన్డేల్లో అరంగేట్రం చేసిన ప్రతీక ఓపెనర్‌గా స్థిరపడిపోయింది. చాపకింద నీరులా ఇన్నింగ్స్ నిర్మించే తను.. ఆఖర్లో పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడుతూ వరల్డ్ కప్‌లో అదరగొట్టింది. స్మృతి మంధానతో కలిసి పోటీగా ఆడుతూ శుభారంభాలు ఇచ్చిన ప్రతీక.. మెగా టోర్నీలో ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక శతకం, హాఫ్ సెంచరీలతో కలిపి 308 రన్స్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది.
A freak injury for Indian opener #PratikaRawal while diving to save a boundary! 😧
Get well soon pratika 💔🙏#CWC25 👉 #INDvBAN pic.twitter.com/KrZ8L7RU8r pic.twitter.com/e9prsRpcKC
— பொ.க. பிரேம் நாத்🦋😍❤️🍫 (@Pk3Premnath) October 26, 2025
లీగ్ దశలో విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాపై అర్ధ శతకంతో చెలరేగిన ప్రతీక సెమీస్‌లోనూ చెలరేగిపోవాలని భావించింది. స్మృతి, తను దంచేస్తే టీమిండియాకు తిరుగుండదని అభిమానులు ఆశించారు. కానీ, లీగ్ దశ చివరి మ్యాచ్‌లో అనుకోని గాయం ప్రతీక తొలి వరల్డ్ కప్ ఆశలను ఆవిరి చేసేసేంది. ఇప్పుడు టేబుల్ టాపర్ ఆస్ట్రేలియాతో గురువారం సెమీఫైనల్ పోరులో మంధానకు జోడీగా ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ఎవరిని పంపాలి? అనేది భారత కోచ్, కెప్టెన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. బంగ్లాపై ఫర్వాలేదనిపించిన అమన్జోత్నే కొనసాగించాలా? మరెవరినైనా పంపాలా? అనే విషయంపై గురువారంకల్లా స్పష్టత రానుంది.
That maiden World Cup hundred feeling 😊
📸 📸 Pratika Rawal brings up her first-ever century in ICC Women’s Cricket World Cups 💯👏
Updates ▶ https://t.co/AuCzj0X11B#TeamIndia | #WomenInBlue | #INDvNZ | #CWC25 pic.twitter.com/DkrZwlwXuu
— BCCI Women (@BCCIWomen) October 23, 2025