లాహోర్: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ షార్ట్(Matthew Short) గాయపడ్డాడు. దీంతో అతను చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆడేది అనుమానంగా ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. 15 బంతుల్లో 20 రన్స్ కొట్టిన అతను.. కొంత ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. అయితే గ్రూపు బీ నుంచి నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. షార్ట్ 63 రన్స్ చేశాడు.
ఫామ్‌లో ఉన్న షార్ట్ గాయపడడంతో ఆస్ట్రేలియాకు సెమీస్‌లో కష్టాలు ఎదురయ్యే ఛాన్సు ఉంది. సెమీస్‌లో షార్ట్ ఆడేది అనుమానమే అని కెప్టెన్ స్మిత్ పేర్కొన్నాడు. అతను ఇబ్బందిపడుతున్నాడని, సరిగా కదలేకపోతున్నాడని, అతను త్వరగా రికవరీ కావడం కష్టమే అన్నాడు. అయితే షార్ట్ స్థానంలో మరో భారీ హిట్టర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల లంకతో జరిగిన వన్డే సిరీస్‌లో అతను విఫలం అయ్యాడు. ఆల్‌రౌండర్ ఆరన్ హార్డీ ని కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
సెమీస్‌లో ఇండియా లేదా న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా ఆడే ఛాన్సు ఉన్నది. ఇండియాతో అయితే మంగళవారం దుబాయ్‌లో, కివీస్‌తో అయితే బుధవారం లాహోర్‌లో ఆ మ్యాచ్‌లు ఉంటాయి. ఆదివారం కివీస్‌తో జరిగే మ్యాచ్ తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుంది. గ్రూపు బీ నుంచి ఆస్ట్రేలియా ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్నా.. ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా నెగ్గితే అప్పుడు ఆ గ్రూపు స్థానాలు మారుతాయి. ఒకవేళ ఇంగ్లండ్ భారీ తేడాతో గెలిస్తే, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానానికి వెళ్లే ఛాన్సు ఉన్నది.
Matt Short is in a race against time to be fit for the #ChampionsTrophy semi-final
READ: https://t.co/OVtMGnPiqW pic.twitter.com/eC82hSYuxR
— cricket.com.au (@cricketcomau) March 1, 2025